AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్ల జీలకర్ర నూనెతో జుట్టు రాలడానికి చెక్.. ఆయిల్ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలి పెట్టరు.. ఎలా వాడాలంటే…

Hair Care Tips: ప్రస్తుత ఆధునిక కాలంలో మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య జుట్టు రాలడం. శరీరంలో హార్మోన్స్ సమస్య,

నల్ల జీలకర్ర నూనెతో జుట్టు రాలడానికి చెక్.. ఆయిల్ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలి పెట్టరు.. ఎలా వాడాలంటే...
Black Seed Oil
Rajitha Chanti
|

Updated on: May 17, 2021 | 7:15 PM

Share

Hair Care Tips: ప్రస్తుత ఆధునిక కాలంలో మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య జుట్టు రాలడం. శరీరంలో హార్మోన్స్ సమస్య, సరైన పోషకాహరం తీసుకోకపోవడం వలన జుట్టు రాలడం.. సన్నగా మారిపోవడమే కాకుండా.. కుదుళ్ళ చివరన చిట్లిపోవడం జరుగుతుంటుంది. ఇక ఈ సమస్యను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు. టీవీలో వచ్చే ప్రతి కెమికల్ ప్రొడక్ట్ కొనేసి ఉపయోగిస్తుంటారు. ఫలితంగా మరిన్ని జుట్టు సమస్యలతోపాటు చర్మ సమస్యలు ఎదుర్కోనే అవకాశం కూడా ఉంది. అయితే మన ఇంట్లోని వంటశాలలో ఉండే కొన్ని పదార్థాలు జుట్టు సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహయపడతాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నల్ల జీలకర్ర. ఇది జుట్టు సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహయపడుతుంది.

నల్ల జీలకర్ర నూనె జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా.. బలంగా.. మరింత పొడవుగా పెరిగెందుకు సహాయపడుతుంది. ఇందులో థైమోక్వినోన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటిహిస్టామైన్. ఇది జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, ఐరన్, విటమిన్ సి వంటి ఇతర పోషకాలు కూడా జుట్టుకు బాగా పనిచేస్తాయి. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహయపడతాయి. అలాగే చుండ్రు, సోరియాసిస్, తామర వంటి చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటి హిస్టామైన్లు నిగెలాన్, థైమోక్వినోన్ ఉన్నాయి. నల్ల జీలకర్ర జుట్టు పెరగడానికి సహయపడుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇవే కాకుండా.. జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. ఇది లినోలెయిక్ ఆమ్లాన్ని కలిగి ఉండడం వలన తెల్లజుట్టును నిరోధిస్తుంది.

నల్ల జీలకర్రను ఎలా ఉపయోగించాలంటే.. * నల్లజీలకర్రను కొంచెం కొబ్బరి నూనెలో కలిపి తలకు అప్లై చేయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేయడం వలన జుట్టు రాలడం ఆగిపోతుంది. * నల్ల జీలకర్ర నూనె, కాస్టర్ ఆయిల్ సమాన మొత్తంలో తీసుకోని రాత్రి పూట తలపై మసాజ్ చేయాలి. మరునాడు ఉదయాన్నే షాంపూతో శుభ్రం చేసుకోవాలి. * 2 టేబుల్ స్పూ్న్ల నల్ల జీలకర్ర నూనెను తలపై అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును శుభ్రం చేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం జుట్టు పెరుగుతుంది. * ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి తలకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వలన జుట్టు మృదువుగా మారుతుంది. * 1 నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నల్లజీలకర్ర నూనెను కలిపి తలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వలన జుట్టు రాలడం ఆగిపోతుంది.

Also Read: Priyanka Nick Jonas: షూటింగ్‏లో గాయపడ్డ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్.. ఆసుపత్రిలో చేర్చిన సిబ్బంది..