Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముంబైకి చెందిన వీడియోలు.. ఇందులో నిజమెంత..?
Fact check: ‘తౌటే’ తుఫాను తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. అయితే ముంబైలో పలు విధ్వంసాలపై కొన్ని వీడియోలు..
Viral Video: : ‘తౌటే’ తుఫాను తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. అయితే ముంబైలో పలు విధ్వంసాలపై కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లపై చెట్లు, భవనాలు కూలడం వంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఒక వైపు కరోనా మమహ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది. తుఫాను దేశ పశ్చిమ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న ఈ తుఫాను ప్రస్తుతం మరింతగా బలపడింది. తుఫాను మరింత బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. ఇప్పటికే ముంబైలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
తుఫాన్ అతి తీవ్రమైన తుఫానుగా మారి గుజరాత్ తీర ప్రాంతాల వైపు కదులుతోంది. ఈ తుఫాను కారణంగా గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ముంబైకి పశ్చిమ దిశగా 15 కి.మీ దూరంలో ఉన్న తుఫాన్.. గంటకు 20 కి.మీ వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. ముందుగా ఈ నెల 18న తీరాన్ని దాటుతుందని అంచనా వేయగా.. ఈ రోజు రాత్రి 8.30 గంటల నుంచి 11.30 మధ్య గుజరాత్‌లోని పోరుబందర్-మహువా మధ్య తీరం దాటనుంది. అయితే ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ట్రైడెంట్ హోటల్ పార్కింగ్ స్థలంలో నిలిపిన కార్లపై బలమైన గాలులతో భవన శిథిలాలు, చెట్లు కూలిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోలు గురించి సెర్చ్ చేయగా, ముంబైకి చెందినవి కాదని, ఆగస్టు 2020 నాటిదని స్పష్టం అవుతోంది. సౌదీ ఆరేబియాలోని మదీనాలో నగరంలో కురిసిన వర్షాలు భయాందోళనకు గురి చేశాయి. ఈ వర్షాల కారణంగా ఆస్తి నష్టం బాగా జరిగింది. అయితే ఆ సమయంలో ఓ ప్రాంతంలో నిలిపిన కార్లపై చెట్లు, భవన శిథిలాలు కూలిన ఘటనకు సంబంధించినవి ఈ వీడియోలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి నకిలీవని పలు నివేదికలు చెబుతున్నాయి.
With the wind speed of 70 to 90 kilometre per hour this is what happened outside hotel Trident Nariman point Mumbai pic.twitter.com/7EdyCnY5e1
— ???jaggirmRanbir??? (@jaggirm) May 17, 2021
watsapp fwd saying infront of trident hotel this morning @IndiaWeatherMan pic.twitter.com/2OnmoAG222
— Parag Pai (@equitysoul) May 17, 2021
#FactCheck : No incident of tree/structure fall on vehicles is reported near #Trident hotel in #Mumbai. Video circulating on social media is false. Our correspondent reports that, incident was reported at some other place. @MumbaiPolice@mybmc #cyclonetaukate @AUThackeray pic.twitter.com/Jg52IuD0Aj
— AIR News Mumbai, आकाशवाणी मुंबई (@airnews_mumbai) May 17, 2021