cow urine therapy : కోవిడ్ నివారణకు గోమూత్రం దివ్యమైన ఔషధం , అందుకే రోజూ తాగుతానంటున్న బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్
గోమూత్రాన్ని తాను రోజూ తాగుతానని, అందుకే తనకు కోవిడ్ రాలేదని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అంటున్నారు. ప్రతి రోజూ దీన్ని తాగడంవల్ల కరోనా నుంచి తనను తాను రక్షించుకుంటున్నానని ఆమె చెప్పారు. దేశీయ గోమూత్రం తాగిన పక్షంలో కోవిడ్ కారణంగా...
గోమూత్రాన్ని తాను రోజూ తాగుతానని, అందుకే తనకు కోవిడ్ రాలేదని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అంటున్నారు. ప్రతి రోజూ దీన్ని తాగడంవల్ల కరోనా నుంచి తనను తాను రక్షించుకుంటున్నానని ఆమె చెప్పారు. దేశీయ గోమూత్రం తాగిన పక్షంలో కోవిడ్ కారణంగా వచ్ఛే లంగ్ ఇన్ఫెక్షన్ ని కూడా అది నయం చేస్తుందని అన్నారు. ఇది అసలు ప్రాణ రక్షణ పానీయం అని వ్యాఖ్యానించారు. గోమూత్రం, ఇతర గో సంబంధ ఉత్పత్తుల మిశ్రమాన్ని తీసుకున్నందున తన క్యాన్సర్ నయమైందని రెండేళ్ల క్రితం ప్రగ్యా ఠాకూర్ చెప్పుకున్నారు. కోవిద్ లక్షణాలకు గురైన ఈమెను గత ఏడాది డిసెంబరులో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు., మరి అప్పుడు ఆమె ఇలాంటి ప్రకటన చేయలేదు.. కోవిద్ నిరోధానికి శాస్త్రీయ ఆధారాలు లేని మందులు పనికి రావని డాక్టర్లు పదేపదే చెబుతున్నా ప్రత్యా ఠాకూర్ వంటి నేతలు మాత్రం తమ ప్రకటనలతో జనాలను గందరగోళంలో పడేస్తున్నారు. ఆవు పేడ గానీ, యూరిన్ గానీ కోవిద్ నివారణలో ఉపకరిస్తాయని చెప్పడానికి శాస్త్రీయ రుజువులు లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ప్రకటించింది.
ఈ నెలారంభంలో యూపీకి చెందిన సురేంద్ర సింగ్ అనే బీజేపీ ఎమ్మెల్యే.. తాను గోమూత్రం తాగడం వల్ల తనను తాను కరోనా వైరస్ నుంచి రక్షించుకున్నానని తెలిపాడు. పైగా చల్లని నీటితో దీన్ని తీసుకోవడం ఉత్తమం అని ప్రకటించాడు. గోమూత్రంలో నిజానికి కరోనాను ‘జయించే’ గుణాలు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా దీనికి ప్రాచుర్యం పెరగాలి.. డాక్టర్లు కూడా ఇది మంచిదని సూచించాలి.. కానీ అలా జరగడంలేదు. కేవలం ఒక పార్టీకి చెందిన నేతలే ఇలా వైవిధ్య ప్రకటనలు చేయడం విశేషం.
Watch | “I don’t have #Covid because I drink cow urine every day”: BJP MP Pragya Singh Thakur pic.twitter.com/kynaJPzgoi
— NDTV (@ndtv) May 17, 2021