Funny Video: స్నేహం అంటే మనదేరా అంటున్న కోతి- మేక.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Sep 02, 2021 | 6:51 PM

నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే లేదు. నిత్యం రకరకాల వీడియోలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని భయం కలిగిస్తే మరి కొన్ని తెగ నవ్వు తెప్పిస్తాయి.

Funny Video: స్నేహం అంటే మనదేరా అంటున్న కోతి- మేక.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Monkey

Funny Video: నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే లేదు. నిత్యం రకరకాల వీడియోలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని భయం కలిగిస్తే మరి కొన్ని తెగ నవ్వు తెప్పిస్తాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అలాంటి వీడియాలు సోషల్ మీడియాలో కోకొల్లలు… ఇక మనుషుల మాదిరిగానే జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. అవి కూడా మనలనే భాదపడతాయి, సంతోషిస్తాయి, ప్రేమిస్తాయి, స్నేహం చేస్తాయి. వైరం మరచి చాలా జంతువులు స్నేహంగా మెలగడం మనం చూస్తూనే ఉంటాం.. కప్పు- పాముతో, పిల్లి- కుక్కతో.. ఇలా చాలా జంతువులు స్నేహంగా ఉంటూ అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరి స్నేహాన్ని చూస్తే మనకు కూడా చాలా ముచ్చట వేస్తుంది. ఇంతకూ ఆ ఇద్దరు స్నేహితులు ఎవరో తెలుసా..?

కోతి-మేక.. ఈ రెండు స్నేహంగా ఉండటం మనం చాలా అరుదుగా చూస్తుంటాం.. ఇక్కడ ఒక మేక- కోతి ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ అందరి  దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  ఈ వీడియోలో కోతి  మేకను ఆటపట్టిస్తూ.. దాని పైకి ఎక్కుతూ.. ఆడుకుంటూ హంగామా చేసింది. అలాగే మేక ఆకులను తింటుంటే కోతి కూడా ఆ ఆకులను తింటూ.. దాని దగ్గనుంచి లాగేసుకుంటూ సరదాగా గడుపుతూ కనిపించింది. వాటి స్నేహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆన్‌లైన్‌లో అరటి ఆకులు.. ధర తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!: Banana Leaves Online Video.

Viral Video: చెట్టుపై చిక్కుకున్న ఆవు.. దించేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీమ్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

గాల్లోకి కాల్పులు..!సంబరాల్లో తాలిబన్లు ఎందుకో తెలిస్తే ఆశ్ఛర్యపోవాల్సిందే..(వీడియో): Talibans Gunfire Video.

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu