AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Different Pregnancy: గర్భం దాల్చిన విషయం తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. అమెరికాలో వింత ఘటన..

Different Pregnancy: అమెరికాలోని బోస్టాన్‌ నగరంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. గర్భాన్ని దాల్చినట్లు కూడా తెలియకుండానే ఓ తల్లి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆలస్యంగా..

Different Pregnancy: గర్భం దాల్చిన విషయం తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. అమెరికాలో వింత ఘటన..
Different Pregnancy America
Narender Vaitla
|

Updated on: Apr 08, 2021 | 2:06 PM

Share

Different Pregnancy: అమెరికాలోని బోస్టాన్‌ నగరంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. గర్భాన్ని దాల్చినట్లు కూడా తెలియకుండానే ఓ తల్లి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వింత సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మెలిస్సా సర్జీకాఫ్, డానీ కాంప్‌బెల్‌ అనే దంపతులు అమెరికాలోని బోస్టన్‌ నగరంలో నివాసం ఉంటున్నారు. అయితే మార్చి 8వ తేదీన మెలిస్సాకు తీవ్రంగా నొప్పులు వచ్చాయి. దీంతో ఏం జరుగుతుందో మెలిస్సాకు పాలు పోలేదు. కిడ్నీలో నుంచి రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లే సమయంలో ఎలాంటి నొప్పి వస్తుందో అలాంటి నొప్పి భావన కలగడంతో మెలిస్సా నేరుగా బాత్‌ రూమ్‌లోకి వెళ్లింది. అయితే నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో మెలిస్సా తట్టుకోలేక గట్టిగా అరిచింది. దీంతో బాత్‌రూమ్‌లోకి వచ్చిన కామ్‌బెల్‌ ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు గుర్తించాడు. దీంతో తర్వాత ఈ విషయం తెలుసుకున్న మెలిస్సా ఆశ్చర్యగానికి గురైంది. మెలిస్సాను పుట్టిన బిడ్డను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్‌ అయిన తర్వాత మెలిస్సా మాట్లాడుతూ.. తాను గర్భం దాల్చిన విషయం కూడా తనకు తెలియలేదని, పొట్ట సైజు కూడా పెరగకపోవడం వల్ల అసలు అలాంటి ఆలోచనే రాలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ ఘటన ఎందుకు జరిగిందన్న విషయం తెలియాల్సి ఉంది.

Also Read: Cherry Blossom Festival: జపాన్ లో ముందే వచ్చిన వసంత కాలం.. విరబూసిన చెర్రీ పూలు .. 1200 ఏళ్లలో..

Twin Sisters: క్రేజీ కవలలు.. గర్భం దాల్చేందుకు వారికి ఒకే బాయ్ ఫ్రెండ్ కావాలట.. కానీ..

Coronavirus: భారత్‌లో కరోనా విజృంభణ.. ప్రయాణికులపై న్యూజిలాండ్‌ ఆంక్షలు.. ఎప్పటివరకంటే..?