Coronavirus: భారత్‌లో కరోనా విజృంభణ.. ప్రయాణికులపై న్యూజిలాండ్ ఆంక్షలు.. ఎప్పటివరకంటే..?
New Zealand - India: భారత్‌లో కరోనా ఉధృతి భారీగా పెరుగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత
New Zealand – India: భారత్‌లో కరోనా ఉధృతి భారీగా పెరుగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11 నుంచి 28 వరకు ఈ నిషేదం కొనసాగుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల భారత్ నుంచి వచ్చిన 23 మందిలో 17 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన క్రమంలో ముందుజాగ్రత్తగా ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెన్ పేర్కొన్నారు. కరోనా హాట్‌స్పాట్‌లుగా ఉన్న దేశాల పరిస్థితులను తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతుందన్నారు. వైరస్ కట్టడికి ప్రయాణాలను నిలిపివేయటం తాత్కాలిక చర్యే అయినప్పటికీ.. ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని జెసిండా పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. న్యూజిలాండ్‌లో కరోనావైరస్బాధితుల సంఖ్య 2,531కి చేరింది. ఇవే ఆంక్షలు తమ దేశ వాసులకు కూడా ఉంటాయని జెసిండా తెలిపారు.
ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ కేసుల సంఖ్య లక్షా 26 వేలు దాటడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో బుధవారం దేశవ్యాప్తంగా 1,26,789 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 685 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574 (1.29 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 1,66,862 కు చేరింది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే.. ఈ సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది.
Also Read: