AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narendra Modi: నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. కోవిడ్‌ పరిస్థితులపై కీలక నిర్ణయాలు..!

COVID-19 situation - PM Interact with CMs: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన

Narendra Modi: నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. కోవిడ్‌ పరిస్థితులపై కీలక నిర్ణయాలు..!
PM Narendra Modi
Shaik Madar Saheb
|

Updated on: Apr 08, 2021 | 8:40 AM

Share

COVID-19 situation – PM Interact with CMs: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది. దీంతో అటు కేంద్రంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన మొదలైంది. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు సలహాలు ఇస్తోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ చర్చించనున్నారు.

దేశంలో కోవిడ్‌ కేసులు లక్ష దాటుతుండటంతో.. తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు ఇవ్వనున్నారు. దీంతోపాటు కరోనా కట్టడికి కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయడం, కర్ఫ్యూ తదితర అంశాలపై సలహాలు ఇవ్వనున్నారు. కాగా.. దేశంలో ఇప్పటికే కోవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ డోసుల సరఫరా.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతమయ్యేలా పలు కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించడంపైనా చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read:

Narendra Modi: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ తర్వాత ఏమన్నారంటే..?

AP MPTC ZPTC Elections 2021 Live: కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్.. భారీగా తరలివస్తున్న ఓటర్లు