Narendra Modi: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ తర్వాత ఏమన్నారంటే..?

PM Modi takes covid vaccine second dose: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం కరోనా వ్యాక్సిన్ రెండో

Narendra Modi: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ తర్వాత ఏమన్నారంటే..?
Pm Modi Takes Covid Vaccine Second Dose
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 08, 2021 | 8:25 AM

PM Modi takes covid vaccine second dose: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన గురువారం ఉదయాన్నే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ”ఈ రోజు ఎయిమ్స్‌లో కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్నాను.. వ్యాక్సిన్ అనేది వైరస్‌ను ఓడించడానికి మనకు ఉన్న మార్గాలలో ఒకటి. మీరు టీకా తీసుకునేందుకు అర్హులు అయితే వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోండి.. దీనికోసం కోవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ (Http://CoWin.gov.in) చేయించుకోండి”. అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

కాగా.. ప్రధాని మోదీ మార్చి 1న కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం 39 రోజులకు ఆయన వ్యాక్సిన్‌ రెండో డోసు వేయించుకున్నారు. కాగా ప్రధాని మోదీ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను తీసుకున్నారు. గతంలో మాదిరి గానే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఉదయాన్నే ఎయిమ్స్‌కు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ప్రధాని మోదీ చేసిన ట్వీట్..

అయితే మోదీకి కరోనా వ్యాక్సిన్ రెండో డోసు సిస్టర్ నిషా శర్మ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కోవాక్సిన్ రెండో డోసు ఇచ్చి ఆయనతో మాట్లాడని పేర్కొన్నారు. తాను మోదీని కలవడం.. టీకా ఇవ్వడం ఒక చిరస్మరణీయ క్షణమంటూ పేర్కొన్నారు.

కాగా.. తొలి డోసు తీసుకున్న అనంతరం కూడా.. ప్రధాని మోదీ కోవిడ్‌కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడి.. అర్హులందరూ కరోనా టీకాను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:

Coronavirus: హృదయవిదారక ఘటన.. ఒకే చితిపై 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు

West Bengal Election 2021: ఆ వ్యాఖ్యలపై 48 గంటల్లోగా సమాధానమివ్వండి.. మమతా బెనర్జీకి ఈసీ నోటీసులు