Twin Sisters: క్రేజీ కవలలు.. గర్భం దాల్చేందుకు వారికి ఒకే బాయ్ ఫ్రెండ్ కావాలట.. కానీ..
Australian Twin Sisters Love Story: అందరితో పోల్చుకుంటే.. కవలలు కొంచెం స్పెషల్‌గా కనిపిస్తుంటారు. ఎందుకంటే.. వారి రూపురేఖలు అచ్చం ఒకేలా ఉన్నా.. అభిప్రాయాలు మాత్రం
Australian Twin Sisters Love Story: అందరితో పోల్చుకుంటే.. కవలలు కొంచెం స్పెషల్‌గా కనిపిస్తుంటారు. ఎందుకంటే.. వారి రూపురేఖలు అచ్చం ఒకేలా ఉన్నా.. అభిప్రాయాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. కొన్ని సార్లు వారి కథలు విన్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. అయితే ఈ కవలల గురించి.. వారు చెప్పే కోరికల గురించి వింటే మీరే షాకవుతారు. అవునండీ.. ఈ యువతుల అభిప్రాయాలు, కోరికలు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలసుకుందాం.. ఈ సోదరీమణులిద్దరూ.. కలిసి తినడం, నిద్రపోవడమే కాకుండా.. కలిసి బాత్రూంకు వెళ్లాలని.. ఒకేసారి గర్భందాల్చాలని కోరుకుంటున్నారు. ఇంకా వారేమనుకుంటున్నారో చూద్దాం..
ఈ కథ ఆస్ట్రేలియాలో నివసించే కవల యువతులు అనా, లూసీ డెసింక్ కు చెందినది. ఇప్పుడు ఇద్దరూ యుక్త వయస్సుకి చేరుకున్నారు.. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. వారిలో ముఖ్య లక్షణం ఏమిటంటే.. ఇద్దరు యువతుల నిర్ణయం ఒక్కటే.. ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ కలిసి ఆహారం తింటారు, కలిసి పడుకుంటారు. కలిసి బాత్రూంకు వెళతారు. కలిసి స్నానం చేస్తారు. ఇంకా వారిద్దరి ప్రియుడు కూడా ఒక్కడే. ఇద్దరూ కూడా ప్రతిదీ కలిసే చేయాలనుకుంటున్నామని.. అలాంటప్పుడు అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో.. ఈ కవల యువతులు అసలు విషయాన్ని బయటపెట్టారు. తాము చిన్నతనం నుంచి ఇద్దరం ఒకే తరహా డిజైన్ డ్రస్సులు వేసుకునే వారమని.. కలిసి ప్రతిదీ చేసేవారమని.. అందుకే ఇద్దరం కలిసి ఒకే వ్యక్తితో ప్రేమలో పడ్డాం.. అతన్నే వివాహం చేసుకోవాలనుకుంటున్నామమని.. ఇద్దరం ఒకేసారి గర్భం దాల్చాలనుకుంటున్నామని కుండబద్దలు కొట్టారు.
2012 సంవత్సరంలో ఇద్దరూ కూడా బెన్‌తో ప్రేమలో పడ్డారు. నివేదిక ప్రకారం… బెన్ ఒక మెకానిక్. అతన్ని చూడగానే కవలలిద్దరూ ఆకర్షితులయ్యారు. కానీ ఇప్పుడు ఈ యువతులకు ఒక సమస్య తలెత్తింది. అదేంటంటే.. ఇద్దరు యువతులు వివాహం చేసుకునుందుకు బెన్‌ను అక్కడి చట్టం అనుమతించదు. 1961 చట్టం ప్రకారం ఆస్ట్రేలియాలో ఏ వ్యక్తికి కూడా ఒకేసారి ఇద్దరితో వివాహం చేసుకోకూడదు. దీంతో ఈ భగ్న ప్రేమికులు చాలా కాలంగా పెళ్లి కోసం కష్టపడుతున్నారు. కానీ వారి కల నెరవేరడం లేదు. ముందు ముందు వారి పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: