Norway Sunset: అర్థ రాత్రి వేళ సూర్యుడు కనిపించే ప్రాంతం… రాత్రి ఎరగని ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా.?

Norway Sunset: ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు మరెన్నో విశేషాలకు నెలవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వైవిధ్యత, విశేషం ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో జరిగే వింతలు, విశేషాలు...

Norway Sunset: అర్థ రాత్రి వేళ సూర్యుడు కనిపించే ప్రాంతం... రాత్రి ఎరగని ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా.?
Norway Sun Set
Follow us

|

Updated on: Apr 08, 2021 | 1:26 PM

Norway Sunset: ఈ అనంత విశ్వం ఎన్నో వింతలు మరెన్నో విశేషాలకు నెలవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వైవిధ్యత, విశేషం ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో జరిగే వింతలు, విశేషాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేయక మానదు. సాధరణంగా ఒక రోజుకు 24 గంటలైతే అందులో దాదాపు సగం వరకు రాత్రి ఉంటుంది. ఇలా పగలు, రాత్రులు సమానంగా ఉంటేనే ఈ విశ్వం సక్రమంగా ముందుకు సాగుతుంది. అయితే రోజులో కేవలం 40 నిమిషాలు మాత్రమే రాత్రి సమయం ఉండే ప్రదేశం ఈ భూమిపై ఉందనే విషయం మీకు తెలుసా.? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.. నార్వే దేశంలో రాత్రి కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ సూర్యుడు రాత్రి 12.43 గంటలకు అస్తమిస్తాడు. మళ్లీ కేవలం 40 నిమిషాల తర్వాతే తిరిగి ఉదయిస్తాడు. అయితే ఏడాదంతా పరిస్థితి ఇలానే ఉండదు లేండి.. వేసవి సమయంలో దాదాపు రెండున్నర నెలలు ఈ దేశంలో వాతావరణం ఇలా వింతగానే ఉంటుంది. అందుకే నార్వేను ‘కంట్రీ ఆఫ్‌ మిడ్‌నైట్‌ సన్‌’గా పిలుస్తుంటారు. ఆర్కిటిక్‌ పరిధిలోకి వచ్చే నార్వేలో మే నుంచి జూలై మధ్యలో సుమారు 76 రోజుల పాటు సూర్యుడు ఇలా ఎక్కువసేపు ఉంటాడు. ఇక ఇదే దేశంలోని మరో నగరంలోని ప్రజలు గత వందేళ్లుగా సూర్యుడిని చూడట్లేదంటా దీనికి కారణం ఆ నగరం చుట్టూ పర్వతాలు చుట్టుముట్టడమే. భలే వింతగా ఉంది కదూ.

Also Read: Pawan Kalyan’s Son Akira Nandan: పవన్ వారసుడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు

MY Home Group: నిర్మాణ రంగంలో అగ్రామి సంస్థ.. మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు 35 ఏళ్లు పూర్తి..

Viral Video: చిలుకా సరస్సు వద్ద కెమెరా కు చిక్కిన అరుదైన పిల్లుల ఫ్యామిలీ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో