Pawan Kalyan’s Son Akira Nandan: పవన్ వారసుడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఓ క్రేజ్ ఉంది. ఆ పేరు వింటే అభిమానులకు పూనకాలే.. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందనే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఓ క్రేజ్ ఉంది. ఆ పేరు వింటే అభిమానులకు పూనకాలే.. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందనే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ సినిమాల్లో రావాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. పవన్ వారసుడిని ఎప్పుడెప్పు వెండి తెరపై చూస్తామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు అకీరా పుట్టిన రోజు. నేటితో అకీరా 17వ పడిలోకి అడుగుపెట్టాడు.
అకీరా తన తల్లి రేణుదేశాయ్ సమక్షంలో పెరుగుతున్నాడు. ఇప్పటికే అకీరాకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆకర్షణీయమైన లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఆరడుగులు మించిపోయాడు అకీరా. అకీరా పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలతో హంగామా చేస్తున్నారు అభిమానులు. అలాగే సినిమా తారలు కూడా అకీరాకు విషెస్ తెలుపుతున్నారు. మెగా ఫ్యామిలీలో ఏ సందడి నెలకొన్నా అకిరా ఆద్యలు కూడా హాజరవుతారు.. తమ అన్నదమ్ములతో కలిసి సంతోషంగా గడుపుతారు.. అయితే పదిహేడేళ్లకే అకిరా.. అన్న వరుణ్ తేజ్ పొడవుకు పోటీ వచ్చేస్తున్నాడు. ఫ్యామిలీ అందరికంటే పొడవు అనిపిస్తూ.. తాను కూడా నెక్స్ట్ హీరోగా ఎంట్రీకి రెడీ అని చెప్పకనే చెప్పేస్తున్నాడు పవన్ తనయుడు. అకీరా ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తే చాలు పవన్ వారసుడుగా రానున్న హీరో అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి అకీరా హీరోగా ఎప్పుడిస్తాడో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Akhil Akkineni: రఫ్ లుక్ లో అదరగొడుతున్న అక్కినేని యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న ఏజెంట్ పోస్టర్..
Telugu Celebrities Birthday: ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న టాలీవుడ్ తారలు వీరే..