Upasana Konidela: సురక్షితంగా ఉన్నామా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటున్న కొణిదల వారి కోడలు..

ఉపాసన కొణిదెల.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా సమాజసేవకురాలిగాను గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన..కేవలం అపోలో అధినేత మనవరాలిగా కాకుండా.. సాధారణ అమ్మాయిలాగా

Upasana Konidela: సురక్షితంగా ఉన్నామా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటున్న కొణిదల వారి కోడలు..
Upasana
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 08, 2021 | 3:25 PM

Upasana Konidela : ఉపాసన కొణిదల.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా సమాజసేవకురాలిగాను గుర్తింపు తెచ్చుకున్నారు ఉపాసన..కేవలం అపోలో అధినేత మనవరాలిగా కాకుండా.. సాధారణ అమ్మాయిలాగా.. సామాజిక సేవల్లో పాల్గోంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. తన వ్యక్తిగత విషయాలతోపాటు.. రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇటీవలి కాలంలో అక్కినేని కోడలు సమంతతో కలిసి కొన్ని ఆరోగ్య సూత్రాలు.. ఫిట్‏నేస్ టిప్స్ చెప్పిన ఉపాసన..తాజాగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మరో ఆరోగ్యపరమైన సలహాను జనాలకు అందించారు ఉపాసన.

ఉపాసన ట్విట్టర్ లో ప్రజలను చైతనపరిచే సలహా ఇచ్చారు.. “నాకు ఇష్టమైన వారి మైండ్ ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం.. ముందే సురక్షితంగా ఉన్నామా లేదా అనే విషయాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా నేను నా స్నేహితులం కలిసి BRCA జెన్యూ టెస్టు చేయించుకున్నాం అంటూ ట్వీట్ చేసింది. BRCA జెన్యూ టెస్టు చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Heroine Anjali: వకీల్ సాబ్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో చిత్రయూనిట్ ..

Jathi Ratnalu Movie: ఓటీటీలోకి వస్తోన్న ‘జాతిరత్నాలు’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే.!

Pawan Kalyan’s Son Akira Nandan: పవన్ వారసుడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు