AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డెక్కిన ‘కార్తీకదీపం’.. డాక్టర్ బాబు.. వంటలక్క కలవాలంటూ ఫ్లెక్సీలు.. ఎక్కడో తెలుసా..

Karthika Deepam: 'కార్తీక దీపం' బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న సీరియల్. ఇటీవలే ఎంతో ఘనంగా 1000 ఎపిసోడ్స్ దిగ్విజయంగా పూర్తిచేసుకొని రికార్డులు సృష్టించింది. అటు అగ్ర హీరోలను

రోడ్డెక్కిన 'కార్తీకదీపం'.. డాక్టర్ బాబు.. వంటలక్క కలవాలంటూ ఫ్లెక్సీలు.. ఎక్కడో తెలుసా..
Karthika Deepam
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2021 | 4:11 PM

Share

Karthika Deepam: ‘కార్తీక దీపం’ బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న సీరియల్. ఇటీవలే ఎంతో ఘనంగా 1000 ఎపిసోడ్స్ దిగ్విజయంగా పూర్తిచేసుకొని రికార్డులు సృష్టించింది. అటు అగ్ర హీరోలను సైతం వెనక్కు నెట్టి రెటింగ్‏లో టాప్ ప్లేస్‏లో దూసుకుపోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం అబిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సాయంత్రం 7.30 కి అందరూ టీవీల ముందు అతుక్కుపోతుంటారు. మరీ అంతాలా ప్రేక్షకులు అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ సీరియల్ ప్రత్యేకత ఎంటో తెలుసా. ఇందులో అందరూ మంచివాళ్లే.. మానవత్వంతో రూపాన్ని చూడకుండా కేవలం మనసును చూసి పెళ్లి చేసుకున్న డాక్టర్ బాబు (కార్తీక్) (నిరుపమ్ పరిటాల).. చివరకు చెప్పుడు మాటలు విని.. భార్యను అనుమానంతో ఏలుకోడు.. ఇక వంటలక్క(దీపీ) (ప్రేమి విశ్వానాథ్) వ్యక్తిత్వాన్ని నమ్ముకొని.. భర్త నమ్మినప్పుడే అత్తగారింటికి వస్తాను అంటుంది… ఇక తమ తల్లిదండ్రులు ఎందుకు విడిపోయి దూరంగా ఉంటున్నారో తెలియకుండా.. వారిద్ధరి మళ్లీ కలిసుండాలని ఆశించే పిల్లలు… ఇక కార్తీక్, దీప కలవకుండా తనదైన స్టైల్లో ప్లాన్స్ వేసే మోనిత (శోభా శెట్టి) ఇదే ఈ సీరియల్ స్టోరీ. కలవడానికి దీప ప్రయత్నం చేస్తున్న.. అనుమానంతో మరింత దూరం పెట్టే డాక్టర్ బాబు… మధ్యలో మోనిత వేసే ప్లాన్స్ వీరిద్దరిని కలవకుండా చేస్తుంటుంది.

Karthika Deepa 4

ఎప్పుడూ ప్రతి సీరియల్లో చూస్తున్న కథే అయినా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో ఈ సీరియల్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అందుకే ఎలాంటి పోటీ ఎదురోచ్చిన చెక్కుచెదరకుండా.. ప్రతి సారి రెటింగ్‏లో టాప్ ప్లేస్‏లో నిలుస్తూ వస్తుంది. అయితే ఈ సీరియల్‏కు ఉన్న పాపులారిటీ మాములుగా లేదండోయ్. కేవలం మహిళలే కాదు .. కార్తీక దీపంకు పురుషులు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక డాక్టర్ బాబు (Doctor Babu), వంటలక్క (Vantalakka) కలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ.. ఆ తరుణం కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులతో ఇటీవలే 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది కార్తీక దీపం.. కానీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఆ సీన్ మాత్రం ఇంతవరకు రాలేదు. దీంతో విసుగెత్తిపోయిన ఓ అభిమాని 1001 ఎపిసోడ్‏లోనైన కలవండి మహ ప్రభో అంటూ.. మొత్తం వంటలక్క కుటుంబాన్ని నడిరోడ్డు మీదకు తీసుకోచ్చేశాడు. ఎంటీ ఆశ్చర్యపోయారా ? నిజమేనండి బాబు.. కానీ కార్తీక దీపం నటీనటులను నేరుగా తీసుకురాలేదు.. వారి ఫోటోలను ఓ బ్యానర్ పై పెట్టేసి చేసి.. రోడ్డు పక్కన రెండు కర్రలు పాతేసి ఫ్లెక్సీ పెట్టేశాడు. ఎంటీ నమ్మడం లేదా ? ఆ ఫ్లెక్సీని మీరు ఓ సారి చూసేయ్యండి..

Karthika Deepam 1

కార్తీక దీపం.. 1001వ ఎపిసోడ్‏లో అయిన దీప & డాక్టర్ బాబు కలవాలి అని కోరుకుంటూ.. మీ కేబుల్ ఆపరేటర్ కోటారి జగన్ అంటూ తన ఫోటను కూడా ఫ్లేక్సీ పై వేయించాడు. ఇక ఈ ఫ్లెక్సీ చూస్తుంటే అర్థమవుతుంది కదూ.. అతను కార్తీక దీపం సీరియల్ ఎంత పెద్ద అభిమానో అర్థమైపోతుంది. ఈ ఫ్లెక్సీని తూర్పు గోదావరి జిల్లా రాజంపాలెంలో కట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ ఫ్లెక్సీని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అయ్యింది. మరీ అతను కోరుకున్నట్టుగానే వంటలక్క, డాక్టర్ బాబులు ఎప్పుడు కలుస్తారో వేటి చూడాల్సిందే.

Karthika Deepam 2

Also Read: ఆ టాప్ హీరోలు ఇద్దరూ ఫిదా సినిమాను రిజెక్ట్ చేశారు.. సారంగదరియా వివాదం.. శేఖర్ కమ్ముల కన్నీటి పర్యంతం..

Premi Vishwanath: సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. నయనతారతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..