Jathi Ratnalu Movie: ఓటీటీలోకి వస్తోన్న ‘జాతిరత్నాలు’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే.!
Jathi Ratnalu Movie: నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు అనుదీప్ కేవీ తెరకెక్కించిన చిత్రం 'జాతి రత్నాలు'. మార్చి 11వ తేదీన విడుదలైన ఈ సినిమా...
Jathi Ratnalu Movie: నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు అనుదీప్ కేవీ తెరకెక్కించిన చిత్రం ‘జాతి రత్నాలు’. మార్చి 11వ తేదీన విడుదలైన ఈ సినిమా.. విడుదలైన రోజు నుంచే మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది.
స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సంచలన విజయం అందుకోవడంతో సినీ వర్గాల్లో సైతం ఆనందం వెల్లువెత్తుతోంది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటన, కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. కోవిడ్ అనంతరం ఓవర్‌సీస్ లో వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడంతో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా మరో రికార్డును సృష్టించింది. ఈ మూవీ విజయంతో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాలకు వరుసపెట్టి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెలికాస్ట్ అయ్యేందుకు సిద్దమైంది. ఏప్రిల్ 11న ప్రసారం కానుంది.
Also Read:
‘జగనన్న స్మార్ట్ టౌన్’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!
ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!
ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!