Akhil Akkineni: రఫ్ లుక్ లో అదరగొడుతున్న అక్కినేని యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న ఏజెంట్ పోస్టర్..

అఖిల్ అక్కినేని.. ఈ కుర్రహీరో 'అఖిల్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ హిట్

Akhil Akkineni: రఫ్ లుక్ లో అదరగొడుతున్న అక్కినేని యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న ఏజెంట్ పోస్టర్..
Agent
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 08, 2021 | 12:25 PM

Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ఈ కుర్రహీరో ‘అఖిల్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ హిట్ అందించిన విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో సినిమా చేసాడు. ‘హలో’ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత మిస్టర్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, పాటలు ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ టీజర్ సినిమా పైన ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. నేడు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా సురేందర్ రెడ్డి సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. గిరజాల జుత్తు ఒత్తుగా పెరిగిన గడ్డం మీసాలతో అతడు రియల్ ఏజెంట్ నే తలపిస్తున్నాడు. అనిల్ సుంకర- ఎకె ఎంటర్ టైన్మెంట్స్ – సురేందర్ 2 సినిమా బ్యానర్లలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఏజెంట్ మూవీ రెగ్యులర్ షూట్ ఈ నెల 11 నుండి ప్రారంభమవుతుంది. 2021 డిసెంబర్ 24 న ఏజెంట్ ను విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Telugu Celebrities Birthday: ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న టాలీవుడ్ తారలు వీరే..

Most Eligible Bachelor: అఖిల్ కు బర్త్ డే విషెస్ తెలిపిన మోస్ట్ ఎలిజిబుల్ చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న న్యూ పోస్టర్..

Nithya Menen Birthday: అందం, అభినయం కలబోసిన బబ్లీ గర్ల్‌.. ట్యాలెంట్‌కు చిరునామా ఈ చిన్నది..