Cherry Blossom Festival: జపాన్ లో ముందే వచ్చిన వసంత కాలం.. విరబూసిన చెర్రీ పూలు .. 1200 ఏళ్లలో..

Cherry Blossom Festival : జపాన్ లో ప్రతి ఏడాది జరిగే ఏప్రిల్ లో చెర్రీ పూల ఫెస్టివల్ కోసం దేశవిదేశాల పర్యాటకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. మనం కార్తీక మాసంలో ఎలా వన భోజనాలు...

Cherry Blossom Festival: జపాన్ లో ముందే వచ్చిన వసంత కాలం.. విరబూసిన చెర్రీ పూలు ..  1200 ఏళ్లలో..
Cherry Blossom Season
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2021 | 1:45 PM

Cherry Blossom Festival : జపాన్ లో ప్రతి ఏడాది జరిగే ఏప్రిల్ లో చెర్రీ పూల ఫెస్టివల్ కోసం దేశవిదేశాల పర్యాటకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. మనం కార్తీక మాసంలో ఎలా వన భోజనాలు చేస్తూ సంతోషంగా జరుపుకుంటామో.. అలాగే జపాన్లో చెర్రీ వికసించే కాలం వసంతకాలం అంటూ జపాన్ వాసులు ఏప్రిల్ లో చెర్రీ చెట్ల మధ్య ఎక్కువగా గడుపుతూ సంతోషంగా ఉంటారు.. అంతగా అక్కడి వారిని ఆకట్టుకుంటాయి చెర్రీ పూల వికాశం..అయితే తాజాగా జపాన్ వాసులను ఈ చెర్రీ చెట్లు ఓ వైపు ఆనందనానికి గురి చేస్తూనే.. మరోవైపు టెన్షన్ ను పెడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

జపాన్ లో చెర్రీ చెట్ల పూలు సీజన్ కన్నా ముందే వికసించాయి. పింక్ అండ్ వైట్ లో ఉండే ఈ పూలను సకురా అని కూడా పిలుస్తారు. 1200 ఏళ్ల తర్వాత ఈ పూలు పూసే సీజన్‌ కాస్త ముందు రావడం ఇదే మొదటిసారి అంటున్నారు జపాన్ వాతావరణ నిపుణులు. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్ అని చెబుతున్నారు. అయితే జపాన్ వాసులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెర్రీ చెట్లు పూలు సర్వసాధారణంగా ఎప్పుడూ ఏప్రిల్లో వికసిస్తాయి. అప్పుడే పిల్లలకు స్కూళ్లు కూడా తెరుస్తారు. అలా వికసించిన పూల గుబాళింపుతో రోడ్లన్నీ మంచి సువానని సంతరించుకుంటాయి. అందుకే ఈ సీజన్ని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లా పెద్దా అందరూ కలిసి చెర్రీ చెట్ల పూల మధ్య ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు. ప్రతి ఒక్కరూ ఈ సీజన్ కోసం ఎదురు చూస్తారు. ఈ చెర్రీపూల వికాశం 15 రోజులు మాత్రమే ఉంటుంది. అందుకనే ఈ రెండు వారాలల్లోనే ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అక్కడి అందాలను చిత్రీకరించడానికి దేశ విదేశాలనుంచి పర్యాటకులు జపాన్‌ కు ప్రయాణమవుతారు. మన దేశంలోనూ లడాఖ్లో ఈ ఫెస్టివల్ ను ఆదర్శంగా తీసుకుని ఆప్రికాట్ ఫెస్టివల్ ను జరుపుతున్నారు.

Also Read:  మీకు డిఫరెంట్ కాఫీ టెస్ట్ ఇష్టమా.. అయితే కాఫీ మిల్క్ షేక్ ను ట్రై చేయండి..

చిలుకా సరస్సు వద్ద కెమెరా కు చిక్కిన అరుదైన పిల్లుల ఫ్యామిలీ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో