Blue Java Bananas: ఈ నీలం అరటిపండ్లను ఎప్పుడైనా తిన్నారా..? టేస్ట్ అచ్చం వెనిలా ఐస్ క్రీమ్ లాగానే..
ఆరోగ్యంగా ఉండటానికి పండ్లు తినమని డాక్టర్లతో పాటు ఆరోగ్య నిపుణులు పదే, పదే చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అరటి అనేది ప్రజల ఇళ్లలో సర్వసాధారణంగా కనిపించే పండు.
ఆరోగ్యంగా ఉండటానికి పండ్లు తినమని డాక్టర్లతో పాటు ఆరోగ్య నిపుణులు పదే, పదే చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అరటి అనేది ప్రజల ఇళ్లలో సర్వసాధారణంగా కనిపించే పండు. రాత్రి పడుకునే ముందు ఒక అరటిపండు తింటే చాలు.. బోలెడంత బలం అని పెద్దలు అంటారు. అంతేకాదు అరటిపండు ఇనిస్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఈ పండు అన్ని సీజన్లలో మార్కెట్లో లభిస్తుంది. సాధారణంగా మీరు ఆకుపచ్చ లేదా పసుపు అరటిపండ్లు చూసి ఉంటారు లేదా తిని ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా నీలి అరటిపండ్లు తిన్నారా…? కనీసం వాటిని చూశారా అని అడిగితే, మీలో చాలా మంది వద్ద నుంచి సమాధానం ఉండదు. అవును నీలి అరటిపండ్లు కూడా ఉంటాయి. అంతేకాదు వీటి రుచి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ వెరైటీ అరటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం పదండి…
ఈ అరటిని ఆగ్నేయాసియాలో సాగు చేస్తారు. హవాయి దీవులలో కూడా ఈ రకం అరటి తోటలు ఉన్నాయి. నీలం రంగు అరటిని దక్షిణ అమెరికాలో కూడా పండిస్తారు. ఎందుకంటే, చల్లటి ప్రాంతాలలో, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో దీని దిగుబడి బాగుంటుంది. అరటిని టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, లూసియానాలో ఎక్కువగా పండిస్తారు. ఈ అరటి రుచి వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుందట . ఈ అరటిని బ్లూ జావా అరటి అని కూడా అంటారు. నీలం రంగు అరటిని కెర్రీ, హవాయి అరటి, ఐస్ క్రీమ్ అరటి అని కూడా అంటారు. ఈ అరటికాయ 7 అంగుళాల పొడవు ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోడం ఖాయం.
‘చెట్టు ఎత్తు 6 మీటర్లు’
ఈ అరటి చెట్టు ఎత్తు ఆరు మీటర్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాగు చేసిన 15 నుంచి 24 నెలల తరువాత పంట రావడం ప్రారంభమవుతుందట.
How come nobody ever told me to plant Blue Java Bananas? Incredible they taste just like ice cream pic.twitter.com/Aa3zavIU8i
— Khai (@ThamKhaiMeng) March 24, 2021
Also Read: చీమలు ఎప్పుడూ ఒకే వరుసలో ఎందుకు నడుస్తాయి? దీని వెనుక గల ఇంట్రస్టింగ్ రీజన్ ఇదే..