VVIP Bodhi Tree: ఈ చెట్టును రక్షించేందుకు ఖర్చు రోజుకు 4 వేల రూపాయలు.. తొమ్మిది సంత్సరాలుగా వీవీఐపీ భద్రత..
ప్రముఖులకు భద్రత కల్పించడం చూశాం.. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు బ్యాంకుల, పరాతన కట్టడాలకు రక్షణ కోసం సెక్యూరిటీ ఏర్పాటు చేయడం చూశాం..
VVIP Bodhi Tree Very Unique: ప్రముఖులకు భద్రత కల్పించడం చూశాం.. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు బ్యాంకుల, పరాతన కట్టడాలకు రక్షణ కోసం సెక్యూరిటీ ఏర్పాటు చేయడం చూశాం.. కానీ కేవలం ఓ చిన్న చెట్టు కోసం పెద్ద ఎత్తు.. అంటే వీవీఐపీ భద్రత కల్పించడం ఎప్పుడైనా విన్నారా.. చదవారా.. లేదుగా.. అయితే ఇక చదవండి..
ఈ వృక్షానికి కూడా వీవీఐపీ భద్రత కల్పిస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. మరి ఆ చెట్టుకు అంత ప్రాధాన్యత ఎందుకంటే.. అది బోధి వృక్షం.. బుద్ధగయ వద్ద చాలా పురాతనమైన, పవిత్రమైన చెట్టు. ఈ వృక్షం క్రింద బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందినట్లు కథనం. బౌద్ధ ధర్మములో చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా బోధి వృక్షానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. శ్రమనుడైన సిద్ధార్థ గౌతముడు రావి వృక్షం కిందే బుద్ధునిగా అవతరించారు. అందుకే రావి చెట్టును బౌద్ధ ధర్మవాదులు ” బోధి వృక్షంగా” గుర్తిస్తారు.
2012 ఏడాదిలో అప్పటి శ్రీలంక్ష అధ్యక్షుడు రాజపక్స.. దేశ పర్యటన సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని సాంచీ స్థూపానికి 5 కిలోమీటర్ల దూరంలో తమ దేశం నుంచి తీసుకొచ్చిన పవిత్ర బోధి వృక్షం కొమ్మను ఇక్కడ నాటారు. అప్పటి నుంచి ఆ మొక్కను మధ్యప్రదేశ్ సర్కార్ జాగ్రత్తగా కాపాడుతోంది.
మధ్యప్రదేశ్ సర్కార్ ఆ బోధి వృక్షానికి 24 గంటల భద్రతను ఏర్పాటు చేసింది. ఆ చెట్టుకు రక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను నియమించింది. చెట్టు చుట్టూ 15 ఫీట్ల ఎత్తులో ఇనుప కంచెను ఏర్పాటు చేసింది. ఈ బోధి వృక్షం రక్షణకు ఏడాది సుమారు రూ. 15 లక్షల వరకు ఖర్చు చేస్తోంది.
ఈ చెట్టుకి నిత్యం నీరు అందేలాగా ఒక వాటర్ ట్యాంకుని కూడా కట్టంచింది. అలాగే వారానికి ఒకసారి చెట్టు నిత్యం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఓ అధికారి పర్యవేక్షిస్తుంటారు.