Mysterious Tree: 1,400 ఏళ్లనాటి వృక్షం.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం
ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. మనిషి సైన్స్‌పరంగా ఎంత ఎదిగినా అతని మేథస్సుకు అందని అద్భుతాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి.
ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. మనిషి సైన్స్‌పరంగా ఎంత ఎదిగినా అతని మేథస్సుకు అందని అద్భుతాలు సృష్టిలో ఎక్కడో అక్కడ బటయపడుతూనే ఉంటాయి. అలాంటి ఓ వింత దృశ్యం చైనాలో ప్రతి సంవత్సరం కనిపిస్తుంది. చైనాలోని ఓ ప్రాంతంలోని చెట్టు నవంబర్ నెల ప్రారంభం కాగానే బంగారు వర్ణంలోకి మారిపోతుంది. ఆకులు ఆకుపచ్చ రంగు నుంచి పసిడివర్ణంలోకి మారిపోతాయి. మిగతా చెట్లు పచ్చగా ఉన్నపటికీ ఇది మాత్రం నవంబర్ వచ్చే సరికి బంగారు వర్ణంలోకి మారిపోతుంది.
చెట్టుకు పసిడి కానీ కాసిందా అన్న భ్రమను కలిగిస్తోన్న ఈ గిన్‌కోగో వృక్షం 1,400 ఏళ్లనాటిది. ప్రతి నవంబర్‌లో ఈ చెట్టు ఆకుల రాలి.. ఆ ప్రాంతమంతా పసుపు రంగులోకి మారుస్తుంది. పొద్దుపొద్దున్నే కురుస్తున్న మంచులో ఈ చెట్టు వద్దకు వెళ్తే.. మరో ప్రపంచంలో ఉన్నట్లు ఉంటుంది. ఆశ్యర్యకరంగా ప్రతి ఏటా ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. చైనాలో హోంగన్ మౌంటైన్స్‌లోని గు గునిన్ బుద్ధిస్ట్ టెంపుల్ ఆవరణలో ఈ చెట్టు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలా తన రంగు మార్చుకుని ఈ వృక్షం పర్యాటకులకు కనువిందుచేస్తుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అధిక సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు.. ఈ చెట్టు సౌందర్యాన్ని చూసి ముగ్దులవుతూ ఉంటారు. 1400 ఏళ్ల క్రితం చైనాను పరిపాలించిన లి షిమిన్ ఈ మొక్కను నాటారని చరిత్ర చెప్తున్నది. దీనిని చైనాలో గింకో బిలోబా వృక్షం అని కూడా పిలుస్తారట.
Also Read: Viral Video: ‘దొంగా.. దొరికిపొయ్యావ్’.. అతడి రియాక్షన్ చూస్తే నవ్వులే నవ్వులు
Andhra Pradesh: రాములోరి కంట నీరు.. ముప్పు తప్పదంటున్న భక్తులు