North Korea: కరోనా బాధితుడు హతం.. కిమ్ మరో దుశ్చర్య.!
North Korea Corona Virus: నార్త్ కొరియా.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనగానే నియంత పాలన, కఠినాతికఠిన శిక్షలు టక్కున గుర్తుకొచ్చేస్తాయి. ప్రపంచమొత్తాన్ని వణికిస్తున్న కొవిడ్-19 (కరోనా వైరస్) విషయంలో అక్కడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అక్కడ జాలి, దయ అనే పదాలకు తావుండదన్న విషయం నాడు జరిగిన కొవిడ్-19 ఘటనతో రుజువైంది. కరోనా వైరస్ ఉందన్న అనుమానంతో ఏకంగా ఓ అధికారిని కాల్చేశారు. ఇప్పుడు […]

North Korea Corona Virus: నార్త్ కొరియా.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనగానే నియంత పాలన, కఠినాతికఠిన శిక్షలు టక్కున గుర్తుకొచ్చేస్తాయి. ప్రపంచమొత్తాన్ని వణికిస్తున్న కొవిడ్-19 (కరోనా వైరస్) విషయంలో అక్కడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
అక్కడ జాలి, దయ అనే పదాలకు తావుండదన్న విషయం నాడు జరిగిన కొవిడ్-19 ఘటనతో రుజువైంది. కరోనా వైరస్ ఉందన్న అనుమానంతో ఏకంగా ఓ అధికారిని కాల్చేశారు. ఇప్పుడు తాజాగా అలాంటిదే మరో ఘటన పునరావృత్తం అయినట్లు తెలుస్తోంది. ఆ దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు బాధితుడిని అధ్యక్షుడు కిమ్ ఆదేశాల మేరకు అక్కడి అధికారులు కాల్చి చంపేశారట.
అయితే అతడెవరు..? ఎక్కడ నుంచి వచ్చాడు.? ఇతర విషయాలు ఏవి బయటికి రాలేదు. కాగా, ఈ విషయాన్ని మాత్రం చైనా అఫైర్స్‌కు చెందిన ఓ సోషల్ మీడియా కామెంటేటర్ బహిర్గతం చేశాడని తెలుస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్ ఇతరులకు సోకకుండా ఉండేందుకే ఆ దేశ నియంత అధికారులకు ఆదేశాలు జారీ చేసి తొలి కరోనా బాధితుడిని చంపమని చెప్పారట.
ఇదిలా ఉంటే నార్త్ కొరియా ప్రభుత్వం మాత్రం కరోనా కేసులు తమ దేశంలో లేవని స్పష్టం చేస్తూ వస్తోంది. కానీ ప్యోంగ్యాంగ్ నగరంలో కరోనా లక్షణాలతో జనాలు బాధపడుతున్నారని ప్రపంచ మీడియా చెబుతోంది.
For More News:
టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. కివీస్‌కు తిరుగులేని విజయం…
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీ సిరీస్‌కు రోహిత్, కోహ్లీలు దూరం.!
సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. రూ.లక్ష జరిమానా.!
ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.!