వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో
వాహనాల హారన్ విషయంలో కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాన్ని మాత్రమే వాహనాలకు హారన్‌గా వినియోగించుకునేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల వాహనాలకు భారతీయ సంగీత ధ్వనులే హారన్‌గా ఉంటాయని, దీంతో వినడానికి ఆహ్లాదకరంగా కూడా ఉంటుందని అన్నారు. 'నవభారత్ టైమ్స్' 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ మాట్లాడారు. ఫ్లూట్, తబలా, వయెలిన్, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల ద్వారా రూపొందించిన శబ్దాన్నే అన్ని వాహనాలకు వినియోగించేలా చట్టం తీసుకురావాలని అనుకుటున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు.
దేశంలో మొత్తం వాయు కాలుష్యంలో రవాణా రంగం వాటా 40 శాతం వరుకు ఉంటుందని చెప్పారు. అందువల్లే తమ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మిథనాల్, ఇథనాల్ వంటి బయో-ఇంధనంతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. భారతదేశం ద్విచక్ర వాహనాలు, కార్ల ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతోందని గడ్కరీ తెలిపారు. 2014లో భారత ఆటోమొబైల్ రంగం విలువ రూ.14 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు చేరిందని qన్నారు. ఇక ఆటోమొబైల్ రంగంలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం ఉందన్నారు. జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం
దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే వీడియో?
పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్
10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
