Puvvada Ajay Kumar: మంత్రి పువ్వాడకు చేదు అనుభవం…
Latest Telangana News: తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి వివాహానికి హాజరైన ఆయన.. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తనతో తీవ్ర అసహనానికి గురయ్యారు. పొంగులేటి కుమారుడి వివాహానికి మంత్రి కేటీఆర్‌తో పాటు పువ్వాడ అజయ్, మరికొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. అయితే కేటీఆర్ వస్తున్న సమయంలో అక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ కొంచెం అతి చేయడమే కాకుండా మంత్రి […]

Latest Telangana News: తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి వివాహానికి హాజరైన ఆయన.. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తనతో తీవ్ర అసహనానికి గురయ్యారు. పొంగులేటి కుమారుడి వివాహానికి మంత్రి కేటీఆర్‌తో పాటు పువ్వాడ అజయ్, మరికొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.
అయితే కేటీఆర్ వస్తున్న సమయంలో అక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ కొంచెం అతి చేయడమే కాకుండా మంత్రి పువ్వాడను కూడా అడ్డుకున్నారు. అందరి ముందు తనను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అసహనానికి గురైన ఆయన అక్కడే ఉన్న పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి వివాహం కొద్దిరోజుల క్రితమే దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పెళ్లి రిసెప్షన్‌ను ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్ వద్ద గల ఖాళీ స్థలంలో నిర్వహించారు.
For More News:
కరోనా బాధితుడు హతం.. కిమ్ మరో దుశ్చర్య.!
టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. కివీస్‌కు తిరుగులేని విజయం…
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీ సిరీస్‌కు రోహిత్, కోహ్లీలు దూరం.!
సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. రూ.లక్ష జరిమానా.!
ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.!