NZ Vs IND: మైండ్ దొబ్బిందా.? జర్నలిస్టుపై కోహ్లీ ఫైర్.!
NZ Vs IND: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాదు.. మైదానంలో కూడా దూకుడుగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. గతంలో ఇలాంటి సందర్భాలు కూడా ఎన్నో జరిగాయి. కానీ కొద్దిరోజులుగా కోహ్లీ ప్రవర్తనలో మార్పు రావడంతో ప్రత్యర్థులను దుర్భాషలాడటం తగ్గించాడు. అయితే ఇప్పుడు తాజాగా కివీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మరోసారి యువ కోహ్లీని చూడాల్సి వచ్చింది. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ జమీసన్ 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. […]

NZ Vs IND: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాదు.. మైదానంలో కూడా దూకుడుగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. గతంలో ఇలాంటి సందర్భాలు కూడా ఎన్నో జరిగాయి. కానీ కొద్దిరోజులుగా కోహ్లీ ప్రవర్తనలో మార్పు రావడంతో ప్రత్యర్థులను దుర్భాషలాడటం తగ్గించాడు. అయితే ఇప్పుడు తాజాగా కివీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మరోసారి యువ కోహ్లీని చూడాల్సి వచ్చింది.
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ జమీసన్ 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అప్పుడు కోహ్లీ ప్రేక్షకుల వైపు చూస్తూ.. నోటి మీద వేలు ఉంచి దుర్భాషలాడాడు. ఇక దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘స్పిరిట్ అఫ్ ది క్రికెట్ అవార్డు’ మరోసారి అతడికి ఇవ్వాలంటూ నెటిజన్లు వెటకారంగా కామెంట్స్ చేశారు.
అటు విరాట్ కోహ్లీ ఫామ్ కూడా టీమిండియా, అభిమానులకు తీవ్రంగా కలవరపెడుతోంది. న్యూజిలాండ్ పర్యటనలో తన స్థాయికి తగ్గట్టు కోహ్లీ ప్రదర్శన లేదని సీనియర్లు ధ్వజమెత్తుతున్నారు. ఇదిలా ఉంటే రెండో టెస్ట్ ఓటమి తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీని ఆన్-ఫీల్డ్ బిహేవియర్‌పై రిపోర్టర్ ఒకరు ప్రశ్నించగా.. దానికి అతడు ధీటుగా జవాబిచ్చాడు.
అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసుకుని ప్రశ్నలు వేయాలని.. సగం.. సగం ప్రశ్నలు సంధించవద్దని హితవు పలికాడు. ఒకవేళ సంచలనం చేయాలనిపిస్తే.. దానికి సరైన చోటు ఇది కాదని చెప్పాడు. తాను మ్యాచ్ రిఫరీతో ఘటనపై మాట్లాడాడని అతడికి లేని బాధ మీకేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా కోహ్లీసేనకు మాత్రం టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఓటమి ఎదురు కావడమే కాకుండా బ్యాటింగ్ తీరుపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి.
For More News:
కరోనా బాధితుడు హతం.. కిమ్ మరో దుశ్చర్య.!
టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. కివీస్‌కు తిరుగులేని విజయం…
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీ సిరీస్‌కు రోహిత్, కోహ్లీలు దూరం.!
సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. రూ.లక్ష జరిమానా.!
ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.!
మతమేదైనా.. గుడిలో అర్చకుడికి పింఛన్ ఇచ్చిన ముస్లిం.!
Virat Kohli: A very intense guy, to say the least. #NZvIND (cc: @ESPNcricinfo) pic.twitter.com/gYKJ0gZ6hk
— Ben Baby (@Ben_Baby) March 1, 2020
Virat Kohli #NZvIND ??? pic.twitter.com/UoEwgTLxlK
— NamBo (@besanladdoo) March 2, 2020