పిల్లల అక్రమ రవాణా.. 25 మందికి విముక్తి

పిల్లలను అక్రమంగా రవాణా చేస్తోన్న పిల్లలను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా ఆగివున్న ఓ బస్సును తనిఖీ చేయగా..

పిల్లల అక్రమ రవాణా.. 25 మందికి విముక్తి
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2020 | 5:27 PM

పిల్లలను అక్రమంగా రవాణా చేస్తోన్న పిల్లలను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా ఆగివున్న ఓ బస్సును తనిఖీ చేయగా.. అందులో పిల్లలు కనిపించారు. దాదాపు 25 మంది పిల్లలు బస్సులో ఉండగా.. అందులో 14 మంది మేజర్లు కాగా.. మరో 11 మంది బాలలు ఉన్నారు. వీరిని ఛత్తీస్‌గఢ్‌ నుంచి హైదరాబాద్‌కి అక్రమంగా తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నగరంలోని వివిధ చోట్ల ఈ పిల్లలను పనికి పెట్టేందుకే వీరిని ఛత్తీస్ గఢ్ నుంచి తరలించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిల్లలను సైదాబాద్ ప్రాంతంలోని స్టేట్‌హోంకు తరలించారు.

అలాగే.. మైనర్ బాలురను అక్రమంగా నగరానికి తీసుకువస్తోన్న జన్ను కోయెమ్, లలిత్ బాగ్, నాదుగు రామ్, కైలాస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ఛత్తీస్ గఢ్‌కి సంబంధించిన 25 మందిని సైదాబాద్‌ స్టేట్‌ హెంకు తరలించి, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పిల్లల్ని అక్రమ రవాణాకు సూత్రధారులైన వారిని త్వరలోనే అరెస్ట్ చేసి, విచారణ చేస్తామని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: కరోనా భయం.. ఈ బిజినెస్‌ చేస్తే.. కాసుల వర్షమే!