SCR: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.!
South Central Railway: రైలు ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. యూటీఎస్ క్విక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా ఇకపై ప్రయాణీకులు జనరల్ టికెట్లను సులభంగా పొందే అవకాశాన్ని కల్పించింది. గతంలోనే రైల్వే శాఖ యూటీఎస్ యాప్ ద్వారా సెకండ్ క్లాస్ టికెట్లను బుక్ చేసుకునే సౌలబ్యాన్ని ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురాగా.. టిక్కెట్ల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో దానిపై ప్రయాణీకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి చెక్ పెట్టేందుకే […]

South Central Railway: రైలు ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. యూటీఎస్ క్విక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా ఇకపై ప్రయాణీకులు జనరల్ టికెట్లను సులభంగా పొందే అవకాశాన్ని కల్పించింది. గతంలోనే రైల్వే శాఖ యూటీఎస్ యాప్ ద్వారా సెకండ్ క్లాస్ టికెట్లను బుక్ చేసుకునే సౌలబ్యాన్ని ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురాగా.. టిక్కెట్ల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో దానిపై ప్రయాణీకులు పెద్దగా ఆసక్తి చూపలేదు.
దీనికి చెక్ పెట్టేందుకే దక్షిణ మధ్య రైల్వే యూటీఎస్ క్విక్ రెస్పాన్స్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాన నగరాలైన తిరుపతి, గుంటూరు, విజయవాడ, వరంగల్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, హైటెక్ సిటీ, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో ఈ యూటీఎస్ క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని తీసుకురానుంది. దశలవారీగా అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రయాణికులు యూటీఎస్ క్యూఆర్ కోడ్ ఉపయోగించి క్షణాల్లో టిక్కెట్లను పొందవచ్చు. అంతేకాకుండా ఈ కోడ్ వల్ల యాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతారని రైల్వే శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, యూటీఎస్ యాప్ ఉపయోగించి దేశంలో ఎక్కడ నుంచైనా జనరల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
For More News:
కరోనా బాధితుడు హతం.. కిమ్ మరో దుశ్చర్య.!
టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. కివీస్‌కు తిరుగులేని విజయం…
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీ సిరీస్‌కు రోహిత్, కోహ్లీలు దూరం.!
సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. రూ.లక్ష జరిమానా.!