నిర్భయ కేసు.. దోషి పవన్ క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత
నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ ఈ పిటిషన్ వేశాడు. అయితే దాన్ని తిరస్కరించిన కోర్టు..
నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ ఈ పిటిషన్ వేశాడు. అయితే దాన్ని తిరస్కరించిన కోర్టు.. ఇతని అభ్యర్థనపైన, ఇతనికి విధించిన శిక్ష పైన తిరిగి సమీక్ధించాల్సిన అవసరం లేదని పేర్కొంది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ పవన్ పిటిషన్ ను విచారించింది. కానీ ఈ దోషి తన మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతికి దాఖలు చేయవచ్చు. ఇందుకు అతనికి అవకాశం ఉంది. మిగిలిన ముగ్గురు దోషులు ముకేశ్, వినయ్, అక్షయ్ ల మెర్సీ పిటిషన్లను కోర్టు ఇదివరకే కోర్టు కొట్టివేసింది. ముకేశ్, వినయ్ వేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం లోగడ కొట్టివేసిన సంగతి తెలిసిందే. (తమ మెర్సీ పిటిషన్ల తిరస్కృతిని వారు సవాల్ చేశారు). కానీ అక్షయ్ తన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కృతిని ఇంకా సవాలు చేయలేదు. . కాగా-నిర్భయ దోషులు నలుగురినీ ఈ నెల 3 వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉంది.