ఇండియన్ రైల్వేస్ సమర్పించు..”రెస్టారెంట్ ఆన్ వీల్స్”.. సామాన్యులకు కూడా..
గత కొన్నేళ్లుగా ఇండియన్ రైల్వేస్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్‌లోని ఆసన్‌సోల్ రైల్వే స్టేషన్‌లో మరో అడుగు ముందుకు వేసి.. నూతన అధ్యాయానికి తెరలేపింది. ప్రయాణికుల నుంచి వచ్చే లాభాలే కాకుండా..
గత కొన్నేళ్లుగా ఇండియన్ రైల్వేస్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్‌లోని ఆసన్‌సోల్ రైల్వే స్టేషన్‌లో మరో అడుగు ముందుకు వేసి.. నూతన అధ్యాయానికి తెరలేపింది. ప్రయాణికుల నుంచి వచ్చే లాభాలే కాకుండా.. పరోక్షంగా కూడా రైల్వే స్టేషన్ల ద్వారా లాభాలను గడించేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా బోగీలలో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తోంది. దీనికి రెస్టారెంట్ ఆన్ వీల్స్ అనే పేరుతో.. తొలి రెస్టారెంట్‌ను ప్రారంభించారు కేంద్రమంత్రి, అసోన్ సోల్ ఎంపీ బాబుల్ సుప్రియో.
ఈ “రెస్టారెంట్ ఆన్ వీల్స్” లో రైల్వే ప్రయాణీకులకే కాకుండా.. సామాన్య ప్రజలు కూడా వెళ్లి తినేందుకు వీలుంటుంది. ఈ రెస్టారెంట్‌లను రీఫర్బిషింగ్ చేసిన మెమూ కోచ్‌లతో తయారుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రెస్టారెంట్‌ల ఏర్పాటు వల్ల.. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్గించడమే కాకుండా.. పరోక్షంగా ఆదాయాన్ని అర్జించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.50 లక్షల వరకు ఈ రెస్టారెంట్ ఆన్ వీల్స్ ద్వారా ఆదాయం వచ్చేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి రెస్టారెంట్లు పెట్టే అవకాశ ఉంది.