ఆత్మహత్యలొద్దంటూ స్కూల్లో రైతు కొడుకు పద్యం..అంతలోనే తండ్రి బలవన్మరణం

రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ప్రతి రాజకీయ నాయకుడి స్పీచ్‌‌లో వినిపించే మాటే. అది కేవలం నోటి మాటగానే మిగిలిపోయింది గానీ..ఎప్పుడు ఆచరణ సాధ్యంగా మారుతుందో అర్థం కావడం లేదు. నిత్యం తాను ఓడిపోతూనే..ప్రపంచాన్ని గెలిపించడం రైతుకు మాత్రమే సాధ్యమేమో. ఎందుకంటే ప్రతి మనిషికి రోజూ ఆకలి వేస్తుంది..అప్పుడు ముద్ద నోట్లోకి వెళ్తుంది అంటే దానికి కారణం అతడేగా. వ్యవసాయంలో లాభం అనే మాట ఇప్పుడు లేదు. చేసిన కష్టానికి డబ్బులొస్తే చాలు అనుకునే రోజులొచ్చాయ్. అప్పులు, […]

ఆత్మహత్యలొద్దంటూ స్కూల్లో రైతు కొడుకు పద్యం..అంతలోనే తండ్రి బలవన్మరణం
Follow us

|

Updated on: Mar 02, 2020 | 8:45 PM

రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ప్రతి రాజకీయ నాయకుడి స్పీచ్‌‌లో వినిపించే మాటే. అది కేవలం నోటి మాటగానే మిగిలిపోయింది గానీ..ఎప్పుడు ఆచరణ సాధ్యంగా మారుతుందో అర్థం కావడం లేదు. నిత్యం తాను ఓడిపోతూనే..ప్రపంచాన్ని గెలిపించడం రైతుకు మాత్రమే సాధ్యమేమో. ఎందుకంటే ప్రతి మనిషికి రోజూ ఆకలి వేస్తుంది..అప్పుడు ముద్ద నోట్లోకి వెళ్తుంది అంటే దానికి కారణం అతడేగా. వ్యవసాయంలో లాభం అనే మాట ఇప్పుడు లేదు. చేసిన కష్టానికి డబ్బులొస్తే చాలు అనుకునే రోజులొచ్చాయ్. అప్పులు, గిట్టుబాటులేని ధరలు వారిని నిండా మింగేస్తున్నాయ్. రైతుల ప్రస్తుత జీవితాలను ప్రతిబింబించే ఓ విషాద సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని అహ్మదాబాద్‌ పరిధిలోని భరజ్వాడిలోని ఓ స్కూల్లో విద్యార్థి రైతు ఆత్మహత్యలపై..ఓ పద్యాన్ని చదవి వినిపించాడు. అది అక్కడ ఉన్నవారి మనసులను తాకింది. అందరూ చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఇది జరిగిన కొద్ది సేపటికే రైతు అయిన ఆ విద్యార్థి తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ విద్యార్థి రోదనలు మిన్నంటాయి. సాగు కోసం తీసుకున్న రుణాలు గుదిబండగా మారడంతో సదరు రైతు పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. అదే రోజు మరాఠీ భాషా దినోత్సవం సందర్భంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ అతని కుమారుడే పద్యాన్ని చదవాడు. భూమి మనిషులందర్నీ మింగేస్తుంది..అదేంటో రైతులను మాత్రం అందరికంటే ముందే లాగేసుకుపోతుంది. బహుశా తనను సొంతబిడ్డలా సాకుతోన్న వారిపై మమకారం కొవొచ్చు.