గోపనపల్లి..రేవంత్ భూదందాల ప్రత్యక్ష సాక్షి !

రేవంత్ బ్రదర్స్ భూదందాపై విచారించే కొద్దీ ఆక్రమణలు బయటపడుతున్నాయి. దీంతో ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించి పూర్తి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఆయనపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న రెవెన్యూ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోనికి వస్తుండడంతో ప్రత్యేకంగా విచారణ చేయించడం ద్వారా రేవంత్‌ అక్రమాలను పూర్తి స్థాయిలో వెలికితీయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గోపనపల్లి..రేవంత్ భూదందాల ప్రత్యక్ష సాక్షి !
Jyothi Gadda

|

Mar 02, 2020 | 1:43 PM

రేవంత్ బ్రదర్స్ భూదందాపై విచారించే కొద్దీ ఆక్రమణలు బయటపడుతున్నాయి. దీంతో ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించి పూర్తి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే ఎంపీ రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిలపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలను రెవెన్యూ వర్గాలు నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పటికే ఆయనపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న రెవెన్యూ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోనికి వస్తుండడం, స్థానికుల నుంచి సాక్ష్యాధారాలు కూడా లభిస్తుండడంతో ప్రత్యేకంగా విచారణ చేయించడం ద్వారా రేవంత్‌ అక్రమాలను పూర్తి స్థాయిలో వెలికితీయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రేవంత్‌ రెడ్డి బ్రదర్స్‌ భూ ఆక్రమణల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కోట్ల రూపాయల విలువైన భూములను రేవంత్ రెడ్డి ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులు తేల్చారు. RDO చంద్రకళ విచారణలో రేవంత్‌ భూకబ్జాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లతో పాటు ప్రైవేటు భూములను రేవంత్‌ రెడ్డి బ్రదర్స్ ఆక్రమించినట్లు గుర్తించారు. గత మూడు రోజులుగా ఆర్డీఓ చంద్రకళ విచారణ జరుపుతున్నారు. గోపనపల్లి చుట్టు పక్కల భూములు ఆక్రమించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

రంగారెడ్డి జిల్లా గోపనపల్లి సర్వే నెంబర్ 34లో ఒక ఎకరం 11 గుంటల భూమిని కబ్జా చేసిన రేవంత్.. సర్వే నెంబర్‌ 126 కోమటికుంటలో FTL బఫర్ జోన్‌లో ఎకరా 14 గుంటల్లో పాగా వేసినట్లు గుర్తించారు. యధేచ్ఛగా కబ్జాలతో చెరువులోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం, తెలంగాణ రెవెన్యూ ఫస్లా యాక్ట్ వంటి అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించి రేవంత్‌ సోదరులు భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ భూముల ఆక్రమణలతో చెరువులోకి నీళ్లు రాకుండా రేవంత్‌ అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించిన రేవంత్ బ్రదర్స్ పై క్రిమినల్ చర్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వందేళ్ల నుంచి ఉన్న గోపనపల్లి రోడ్డునూ కూడా రేవంత్‌ బ్రదర్స్‌ కబ్జా చేసేశారని గుర్తించారు. సర్వే నెంబర్‌ 127లో బండ్లబాటలో తిష్టవేసినట్లు నిర్ధారించారు.. సర్వే నెంబర్‌ 128, 160ల్లోనూ 10 గుంటల ప్రయివేట్ స్థలాన్ని కబ్జాచేసి గేట్లు పెట్టుకున్నట్లు గుర్తించారు. సర్వే నెంబర్ 127లోనూ ఐదెకరాల 21 గుంటలు కూడా టైటిల్ ఫేక్ అని విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు.. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి బండ్లబాట, చెరువును రక్షించాలంటూ స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

భూ ఆక్రమణల నేపథ్యంలో 1955 నాటి నుంచి ఉన్న డాక్యుమెంట్స్ పై కూడా విచారణ జరపబోతున్నారు అధికారులు. స్థానికుల దగ్గర ఉన్న డాక్యుమెంట్స్‌తో పాటు.. రెవెన్యూ రికార్డులన్నింటిని పరిశీలించబోతున్నారు. ఇదిలా ఉంటే…ఈ విషయంలో రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, వాల్టా చట్టాన్ని, తెలంగాణ రెవెన్యూ ఫస్లీ చట్టాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించారని రెవెన్యూ విచారణలో తేలినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాల్లో ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరింత లోతుగా విచారణ జరిపించడం ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ బయటకు తీయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆక్రమణలివే! గోపనపల్లి సర్వే నెంబర్ 34లో ఎకరం 11 గుంటల భూమి కబ్జా సర్వే నెంబర్‌ 126 కోమటికుంటలో FTL బఫర్ జోన్‌లో ఎకరా 14 గుంటల్లో పాగా సర్వే నెంబర్‌ 127లో బండ్లబాటలో తిష్ట ఐదెకరాల 21 గుంటల భూమి టైటిల్ ఫేక్ అని విచారణలో నిర్ధారణ సర్వే నెంబర్‌ 128, 160ల్లోనూ 10 గుంటల ప్రైవేట్ స్థలం కబ్జాచేసి గేట్ల ఏర్పాటు అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించి రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూకబ్జాలు రేవంత్ బ్రదర్స్‌పై క్రిమినల్ చర్యలు తప్పవంటున్న నిపుణులు 1955 నాటి నుంచి డాక్యుమెంట్స్‌పై విచారణ జరపబోతున్న అధికారులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu