AP Government Pensions: మతమేదైనా.. గుడిలో అర్చకుడికి పింఛన్ ఇచ్చిన ముస్లిం.!

AP Government Pensions: భారతదేశం అంటేనే సర్వమతాలకు నిలయం. మతసామరస్యాలకు ప్రతీకగా నిలుస్తోంది. హిందు, ముస్లిం భాయిభాయి అన్న నినాదాన్ని అక్షరాల పాటిస్తున్న మన దేశప్రజలు ఒకే తల్లిబిడ్డల వలే కలిసిమెలిసి ఉంటారు. భగవద్గీత అయినా..ఖురాన్ అయినా సరే శాంతినే ప్రబోధిస్తుంది. హిందువులైన, ముస్లింలైనా వారిలో ప్రవహించేది ఒకే రక్తం. కానీ మన రాజకీయ నేతలు మాత్రం ప్రజలను కులమత భేదాలతో విడదీస్తుంటారు. హిందువులు, ముస్లింలు ఎంతలా కలిసిపోయారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. ఏపీలో […]

AP Government Pensions: మతమేదైనా.. గుడిలో అర్చకుడికి పింఛన్ ఇచ్చిన ముస్లిం.!
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2020 | 11:08 PM

AP Government Pensions: భారతదేశం అంటేనే సర్వమతాలకు నిలయం. మతసామరస్యాలకు ప్రతీకగా నిలుస్తోంది. హిందు, ముస్లిం భాయిభాయి అన్న నినాదాన్ని అక్షరాల పాటిస్తున్న మన దేశప్రజలు ఒకే తల్లిబిడ్డల వలే కలిసిమెలిసి ఉంటారు. భగవద్గీత అయినా..ఖురాన్ అయినా సరే శాంతినే ప్రబోధిస్తుంది. హిందువులైన, ముస్లింలైనా వారిలో ప్రవహించేది ఒకే రక్తం. కానీ మన రాజకీయ నేతలు మాత్రం ప్రజలను కులమత భేదాలతో విడదీస్తుంటారు.

హిందువులు, ముస్లింలు ఎంతలా కలిసిపోయారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. ఏపీలో మతసామరస్యాన్ని చాటి చెప్పే ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఇక అది కాస్తా నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా హిందూపురంలో  రజ్వీ సమీవుల్లా అనే వార్డు వాలంటీర్ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఇంటి వద్దకే పింఛన్ల పథకంలో భాగంగా ఓ ఆలయ అర్చకుడికి పింఛన్ అందజేయడానికి ఆయన ఇంటికి వెళ్ళాడు. కానీ అర్చకుడు ఇంట్లో లేకపోయేసరికి ఆయన పని చేస్తున్న ఆలయానికి వెళ్లాల్సి వచ్చింది.

ముస్లిం అయినా కూడా చెప్పులు తీసేసి ఎంతో  శ్రద్దగా ఆలయంలోకి వెళ్లి అర్చకుడి వేలిముద్రలు తీసుకుని పింఛన్ మొత్తాన్ని అందజేశాడు. ఇక ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుల మతాలకు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.

For More News: 

మంత్రి పువ్వాడకు చేదు అనుభవం…

కరోనా బాధితుడు హతం.. కిమ్ మరో దుశ్చర్య.!

టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. కివీస్‌కు తిరుగులేని విజయం…

టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీ సిరీస్‌కు రోహిత్, ‌కోహ్లీలు దూరం.!

సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. రూ.లక్ష జరిమానా.!

ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.!

మైండ్ దొబ్బిందా.? జర్నలిస్టుపై కోహ్లీ ఫైర్.!