AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కోరికలే గుర్రాలైతే.. కక్కుర్తిపడి ప్రైవేటు పార్టులోకి.. ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు

కోరికలే గుర్రాలైతే.. ఏమవుతుంది ఉన్నది కాస్తా ఊడుతుంది. యూకేకి చెందిన ఓ వ్యక్తీ తన కోరికలను తగ్గించుకోలేక.. ఏం చేశాడో చూస్తే.. మీరే షాక్ అవుతారు. ఏకంగా తన ప్రైవేటు పార్టులోకి.. ఆ తర్వాత బాధతో ఆస్పత్రికి వెళ్లాడు. ఆ వివరాలు ఇలా..

Viral: కోరికలే గుర్రాలైతే.. కక్కుర్తిపడి ప్రైవేటు పార్టులోకి.. ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు
Viral 11
Ravi Kiran
|

Updated on: Apr 09, 2025 | 7:13 PM

Share

కొందరిలో హోర్మోన్స్ సమతుల్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హోర్మోన్స్ బ్యాచ్ తమ కోరికలను అడ్డుకట్ట వేసుకోలేరు. వారి కోరికలే గుర్రాలైతే.. లేనిపోని సమస్యలు చుట్టూముడతాయ్. అంతేకాదు వీరు చేసే చిత్రవిచిత్రమైన పనులతో డాక్టర్లు కూడా తలలు పట్టుకుంటారు. ఇలాంటి ఘటనలు ప్రపంచం నలుమూలల చాలానే జరుగుతుంటాయి. సరిగ్గా ఆ కోవకు చెందిన ఓ ఇన్సిడెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నాం.

వివరాల్లోకి వెళ్తే.. యూకే చెందిన ఓ వృద్దుడు తన ప్రైవేటు పార్టులో జొప్పించుకుని.. ఆరు వారాల పాటు బాధపడి చివరికి ఆస్పత్రిపాలయ్యాడు. స్థానికంగా నివాసముండే 56 ఏళ్ల రైతు తన సమీప పొలంలో పశువులను మేపుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అతడి కోరికలు గుర్రాలై.. ఓ కర్రను ఉపయోగించి పురుగుల మందు డబ్బాను ప్రైవేటు పార్టులోకి జొప్పించాడు. ఆ తర్వాత దానిని తీసేందుకు ప్రయత్నించగా.. అది ఎంతకూ రాలేదు. అయితే ఈ విషయంపై డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే.. అతడికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించి.. ఇంట్లోనే ఉండిపోయాడు.

అలా ఆరు వారాల పాటు ఆ వస్తువు ప్రైవేటు పార్టులోనే ఉండిపోవడంతో.. బాధితుడికి కడుపునొప్పి, వాంతులు, జ్వరం, బలహీనత, విరేచనాలు, ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అతడ్ని స్కానింగ్ చేయగా.. ఎక్స్‌రే ఏదో చిత్రమైన వస్తువు ప్రైవేటు పార్టులో ఉన్నట్టు గుర్తించారు. బాధితుడి మానసిక స్థితి మంచిగానే ఉందని.. ఆ వస్తువును సదరు వ్యక్తి ప్రైవేటు పార్టులోకి ఎందుకు జోప్పించాడన్న విషయాన్ని చెప్పట్లేదని తెలిపారు.

మరోవైపు ఫ్లూయిడ్స్, యాంటీ బయోటిక్స్ ద్వారా.. అతడికి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ప్రైవేటు పార్టులోని ఆ ఫారిన్ వస్తువును విజయవంతంగా తొలగించారు. కాగా, చికిత్స సమయంలో రోగి గతంలోనూ తన మలద్వారంలో ఒక రాయిని జొప్పించుకున్నాడని వైద్యులు కనుగొన్నారు. దానిని కూడా బయటకు తీశారు. ఏడు రోజుల్లోనే రోగి పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని డాక్టర్లు అన్నారు. ఆ తర్వాత అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇక ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా జరిగాయని డాక్టర్లు చెప్పుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..