మళ్లీ వణికిన దేశరాజధాని.. రీజన్ తెలిసి షాక్ తిన్న పోలీసులు.. !!

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అల్లర్లు జరిగిన వారం రోజులకు మళ్లీ దేశ రాజధాని గజగజ వణికిపోయింది. ఆదివారం రోజున పోలీసులకు పెద్ద ఎత్తున...

మళ్లీ వణికిన దేశరాజధాని.. రీజన్ తెలిసి షాక్ తిన్న పోలీసులు.. !!
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2020 | 1:41 PM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు వ్యతిరేక.. మరోవైపు అనుకూల ర్యాలీలతో ఢిల్లీ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లతో ఢిల్లీ వణికిపోయింది. అయితే అల్లర్లు జరిగిన వారం రోజులకు మళ్లీ దేశ రాజధాని గజగజ వణికిపోయింది.

ఆదివారం రోజున పోలీసులకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ సారాంశం ఏంటంటే.. ఆదివారం పెద్ద ఎత్తున మరోసారి ఘర్షణలు చోటుచేసుకుంటాయంటూ ఓ వైపు సోషల్ మీడియాలో.. మరోవైపు పోలీసులకు కాల్స్ వచ్చాయి. దీంతో ఉలిక్కిపడ్డ ప్రజలు భయందోళనలకు గురయ్యారు. గత వారం జరిగిన అల్లర్లను గుర్తుచేసుకుంటూ.. ప్రజలు పోలీసులకు కాల్స్ చేయడం మొదలెట్టారు. ఏకంగా ఆదివారం ఒక్కరోజే..481 కాల్స్.. కంట్రోల్ రూంకు వచ్చినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే ఆ వచ్చిన కాల్స్ అన్నీ.. ఫేక్ కాల్స్ అని తేల్చేశారు. అయితే వదంతులు వ్యాపించడంతో.. కాసేపు పలు ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఫేక్ కాల్స్ అని కన్ఫార్మ్ చేసుకున్న తరువాత.. ఏలాంటి భయాందోళనలకు గురవ్వాల్సిన పనిలేదని ప్రజలకు తెలియజేశారు. నగరమంతా ప్రశాంత వాతావరణంలో ఉందని.. వదంతులు నమ్మొద్దని సూచించారు. అయితే ఈ వదంతులను ఎవరూ వ్యాపించారన్న దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేశారు.