- Telugu News Photo Gallery Cinema photos Tollywood movies like the raja saab, Akhanda 2, lenin Movie Shooting Updates on 09 04 2025
సమ్మర్ హీట్ ఎంతున్న డోంట్ కేర్ టాలీవుడ్ సూపర్ స్టార్స్
సమ్మర్ హీట్‌ను కూడా డోంట్ కేర్ అంటున్నారు మన స్టార్స్. మండే ఎండల్లోనూ షూటింగ్స్‌తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. సీనియర్ హీరోలు, యంగజనరేషన్ స్టార్స్, పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అంతా సెట్స్‌లోనే బిజీగా ఉన్నారు. ఇంతకీ ఏ హీరో ఎక్కడ షూటింగ్ చేస్తున్నారు. ఈ స్టోరీలో చూద్దాం. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది.
Updated on: Apr 09, 2025 | 7:15 PM

సమ్మర్ హీట్‌ను కూడా డోంట్ కేర్ అంటున్నారు మన స్టార్స్. మండే ఎండల్లోనూ షూటింగ్స్‌తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. సీనియర్ హీరోలు, యంగజనరేషన్ స్టార్స్, పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అంతా సెట్స్‌లోనే బిజీగా ఉన్నారు. ఇంతకీ ఏ హీరో ఎక్కడ షూటింగ్ చేస్తున్నారు. ఈ స్టోరీలో చూద్దాం.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. అఖండ 2 కోసం ఆర్‌ఎఫ్‌సీలో వేసిన సెట్‌లో షూటింగ్ చేస్తున్నారు నందమూరి నటసింహం.

ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. భాను భోగవరపు సినిమా కోసం జాన్‌వాడలో ఉన్నారు మాస్ మహరాజ్ రవితేజ.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. మిరాయ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు తేజ సజ్జ.

బాచుపల్లిలో తెలుసుకదా షూట్‌లో పాల్గొంటున్నారు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమాతో నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. అఖిల్ హీరోగా మురళీ కిషోర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది.




