- Telugu News Photo Gallery Hot water or cold water know which water is best to drink to stay hydrated in hot summer
Water in Summer: వేసవిలో వేడి నీరు తాగాలా… చల్లని నీరు తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా..
ఈ మండే వేసవిలో వేడి ఉష్ణోగ్రతలు శరీరంలో డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలను కలిగిస్తాయి. తలనొప్పి కూడా రెట్టింపు చేస్తాయి. అధిక వేడి కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది కాబట్టి, మన శరీరం నుంచి చెమట ఎంతగా తొలగిపోతుందో శరీరానికి కూడా అంతే నీరు అవసరం. దీనిని భర్తీ చేయడానికి తాగునీరు చాలా అవసరం..
Updated on: Apr 20, 2025 | 12:46 PM

ఈ మండే వేసవిలో వేడి ఉష్ణోగ్రతలు శరీరంలో డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలను కలిగిస్తాయి. తలనొప్పి కూడా రెట్టింపు చేస్తాయి. అధిక వేడి కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది కాబట్టి, మన శరీరం నుంచి చెమట ఎంతగా తొలగిపోతుందో శరీరానికి కూడా అంతే నీరు అవసరం. దీనిని భర్తీ చేయడానికి తాగునీరు చాలా అవసరం అవుతుంది. లేదంటే డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.

వేసవిలో దాహం వేస్తుందని కొందరు జ్యూస్, కొబ్బరి నీళ్లు, శీతల పానీయాలు తాగుతుంటే మరికొందరు దాహం తీర్చుకోవడానికి ఫ్రిజ్‌లోని చల్లని నీళ్లు తాగుతుంటారు. ఈ చల్లని నీరు తాగడం వల్ల శరీర హైడ్రేషన్ ను కాపాడుకోగలరా? ఈ వేసవిలో వేడి నీరు లేదా చల్లటి నీరు.. ఏ నీరు ఉత్తమమో నిపుణుల ద్వారా తెలుసుకుందాం..

చల్లటి నీళ్ల కంటే వేడి నీళ్లు ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేస్తాయని తెలిపారు. ఇంకా వేడి నీళ్లు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయని.. ఫలితంగా జీర్ణప్రక్రియ ఆరోగ్యంగా మారి అధిక కేలరీలను ఖర్చు చేస్తాయని వివరించారు. ఇదే కాకుండా కడుపు నిండిన భావనను కలిగించి.. ఆహారం తీసుకునే మోతాదును తగ్గిస్తాయన్నారు.

వేడి నీరు లేదా గది ఉష్ణోగ్రత నీరు తాగడం వల్ల శరీరం త్వరగా హైడ్రేట్ అవుతుంది. అందుకే ఈ వేసవిలో చల్లటి నీటికి బదులుగా వేడి లేదా గది ఉష్ణోగ్రత నీటిని తాగడం మంచిది. వేసవిలో చల్లటి నీటికి బదులుగా గది ఉష్ణోగ్రత నీటిని తాగడం వల్ల జీవక్రియను పెంచడంలో, దానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

అదే చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి చాలా సమయం పడుతుంది. బరువు నియంత్రణ, మధుమేహం,కఫం వంటి ఆరోగ్య సమస్యలకు గోరువెచ్చని నీరు త్రాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.




