అలా చేయకుంటే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆదివారం గుంటూరు నగరంలో జరిగిన వైసీపీ సింహగర్జన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా సీఎం జగన్ వ్యవహరించబోరన్న నమ్మకం తనకుందని.. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తారని అనుకుంటున్నానని పేర్కొన్నారు.
కాగా సీఏఏ, ఎన్ఆర్సీపై ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వైసీపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని.. ఇందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. తనకు పదవులు, పార్టీ ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యమని అంజాద్ బాషా అప్పట్లో స్పష్టం చేశారు. ఎన్‌ఆర్సీపై ముందుకెళ్తే అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని ఆయన వెల్లడించారు. సీఏఏ, ఎన్‌ఆర్సీకు సంబంధించి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుతవ్ం ముందుకెళ్లదని.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తాము ఒప్పిస్తామని అన్నారు.