అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో
ఎండాకాలం వచ్చేసింది! వేడి నుంచి రిలీఫ్ కోసం అందరూ కూలర్లు, ఏసీల కోసం చూస్తున్నారు. ఈ సీజన్‌లో జేబుకు చిల్లి పడకుండా చల్లగా ఉండే ఓ కొత్త ఆఫర్ వచ్చింది. అదే కూలర్ల అద్దె సేవ! ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో లభిస్తున్న ఈ సర్వీస్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటోందంటే, ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఈ అద్దె సర్వీస్ ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే, కొత్త కూలర్ కొనడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పనిలేదు. కేవలం నెలకు కొన్ని వందల రూపాయలతో అద్దెకు పొందవచ్చు. వేసవి అయిపోయాక కూలర్‌ను తిరిగి ఇచ్చేస్తే సరి, ఇంట్లో దాచుకోవాల్సిన ఇబ్బంది ఉండదు.
చిన్న గదుల కూలర్ల నుంచి పెద్ద డెసర్ట్ కూలర్ల వరకు అన్ని రకాలూ దొరుకుతాయి. ఈ సదుపాయం చూసి యూత్, స్టూడెంట్స్, చిన్న ఫ్యామిలీస్ ఈ ఆఫర్‌ను ఎగబడి మరీ తీసుకుంటున్నాయి.ఆన్‌లైన్‌లో కూలర్ అద్దెకు తీసుకోవడం చాలా ఈజీ. Rentomojo, Furlenco, Quikr తదితర వెబ్‌సైట్లలో ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. సైట్‌లోకి వెళ్లి, సిటీ సెలెక్ట్ చేసి, కూలర్ టైప్, అద్దె టైమ్ ఎంచుకొని డబ్బులు చెల్లిస్తే చాలు.. కంపెనీ సిబ్బందే కూలర్ ను ఇంటికి తీసుకువస్తారు. ధరలు కూలర్ సైజు, బ్రాండ్ ఆధారంగా నెలకు 300 రూపాయిల నుంచి 1000 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ప్రాసెస్ సింపుల్ గా ఉండటంతో కూలర్ల ఆన్‌లైన్ రెంటల్ బుకింగ్స్ డిమాండ్ ఆకాశాన్ని తాకుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం
దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే వీడియో?
పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్
10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
