సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంటిలో మొక్కల అద్దె ట్రెండ్ వీడియో
కారు అద్దె విన్నాం, ఇంటి అద్దె విన్నాం.. ఆఖరికి మనుషులు కూడా అద్దెకు దొరుకుతారు. కానీ మొక్కల అద్దె గురించి ఎప్పుడైనా విన్నారా? యస్.. మీకు కావాల్సిన మొక్కలను కూడా నెలవారీ అద్దె చెల్లించి ఏం చక్కా ఇంటికి తెచ్చుకోవచ్చన్నమాట. ఈ వేసవిలో కొత్త గ్రీన్ ట్రెండ్ బాగా నడుస్తోంది. వేసవి వేడిని చల్లబరిచేందుకు హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి ఓ సరికొత్త ఐడియా జనాలను ఆకర్షిస్తోంది. ఇంటిని అందంగా, చల్లగా మార్చే ఈ ట్రెండ్ యువతలో సందడి చేస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే మొక్కలు మీ ఇంటికి చేరతాయి.. సీజన్ తర్వాత తిరిగి తీసుకెళతారు.ఒక్క క్లిక్‌తో మీ ఇంటికి మొక్కలు డెలివరీ చేసేందుకు పలు వెబ్‌సైట్లు సిద్ధంగా ఉన్నాయి.
నర్సరీలు కూడా ఈ సేవలను అందిస్తున్నాయి. నెలకు 200 రూపాయల నుంచి 1000 రూపాయల ధరలతో మొక్కలను అద్దెకు తీసుకోవచ్చు. వేసవి అయిపోయాక వాటిని తిరిగి ఇచ్చేయొచ్చు. స్థల సమస్య అనేదే ఉండదు. ఖర్చూ తక్కువే. మొక్కలు ఇంటిని స్టైలిష్‌గా మార్చడమే కాదు, గాలిని శుద్ది చేసి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. జజ్మిన్, అరేకా పామ్, బాంబూ ప్లాంట్ లాంటివి ఇంటి లుక్‌ను ఎలివేట్ చేస్తాయి. వేసవిలో ఇంటిని చల్లగా ఉంచడంలో ఈ మొక్కలు సాయపడతాయి, మీ ఇంటికి సహజమైన వైబ్ ఇస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో #GreenLiving, #PlantLovers ట్యాగ్‌లతో రీల్స్ వైరల్ అవుతున్నాయి! యువత మొక్కలతో అలంకరించిన ఇళ్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ ట్రెండ్‌ను బూస్ట్ చేస్తున్నారు. పర్యావరణ హిత జీవనం, తక్కువ బడ్జెట్‌లో ఫ్యాషనబుల్ డెకర్ కోసం ఈ సర్వీస్ టాప్ ఛాయిస్‌గా నిలుస్తోంది.హైదరాబాద్‌లో కొండాపూర్, మాదాపూర్ నర్సరీలు, విజయవాడలో స్థానిక గ్రీన్ స్టార్టప్‌లు మొక్కలను అద్దెకు ఇచ్చే సేవలను జోరుగా అందిస్తున్నాయి. “అద్దె మొక్కలతో మా బాల్కనీ సూపర్ కూల్‌గా మారింది,” అంటూ హైదరాబాద్‌కు చెందిన కిరణ్ ఆనందం వ్యక్తం చేశాడు. డిమాండ్ ఎక్కువై, కొన్ని నర్సరీలు బుకింగ్ లిస్ట్‌ను పెంచాయి!
మరిన్ని వీడియోల కోసం
దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే వీడియో?
పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్
10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

300 కార్లు.. 38 విమానాలు.. ఇది కదా రాయల్ లైఫ్ అంటే వీడియో

25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు

51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు

పవన్ ఎఫెక్ట్.. రామ్ చరణ్, సుక్కు సినిమాకు బ్రేక్ వీడియో

ఆ వస్తువు కారణంగా.. విమానం ఎక్కకుండా ఆపిన సిబ్బంది వీడియో

అగ్నిపర్వతం బద్ధలు..విమానాలు క్యాన్సిల్ వీడియో

కాసేపట్లో అక్క పెళ్లి ఇంతలోనే ఆక్సిడెంట్లో తమ్ముడు వీడియో
