వయసు 23.. చూడటానికి అమాయకుడు.. కానీ ఏకంగా 11 మందిని పెళ్లిచేసుకున్నాడు.. చివరకు..

వయసు 23.. చూడటానికి అమాయకుడు.. కానీ ఏకంగా 11 మందిని పెళ్లిచేసుకున్నాడు.. చివరకు..

చూడటానికి అమాయకుడిగా ఉన్న ఓ యువకుడు ఏకంగా 11 మంది అమ్మాయిలను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడు. పైగా ఆ యువకుడి వయసు కేవలం 23 సంవత్సరాలే

Rajeev Rayala

|

Jan 15, 2021 | 8:12 PM

చూడటానికి అమాయకుడిగా ఉన్న ఓ యువకుడు ఏకంగా 11 మంది అమ్మాయిలను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడు. పైగా ఆ యువకుడి వయసు కేవలం 23 సంవత్సరాలే.. తమిళనాడు రాజధాని చెన్నైలోని విల్లివాక్కంకు చెందిన గణేష్(23) అనే యువకుడు కొలాత్తూర్ కు చెందిన 20 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబర్ 5న ఇంట్లో పెద్దలకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో ఆ యువతీ తల్లిదండ్రులు పోలీసులకు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఆయువకుడు తన అత్తామామలనుంచి రక్షించాలంటూ.. విల్లివాక్కం పోలీసులను ఆశ్రయించాడు.

అయితే ఆ యువతీ తన తల్లిదండ్రులతో వెళ్ళడానికి అంగీకరించలేదు. తాను గణేషని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని, అతినితో హ్యాపీగా కాపురం చేసుకుంటానని వారికి చెప్పింది. ఆతర్వాత  వారు  ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఈ క్రమంలో ఇంట్లో పనిచేయడానికి మరో యువతిని(17) తీసుకువచ్చాడు గణేష్. భార్య వద్దన్నా అతడు వినలేదు. ఆతర్వాత ఆ యువతితో సన్నిహితంగా మెలగటం ప్రారంభించాడు. దాంతో భార్య భర్త మధ్య గొడవలు జరిగాయి. దాంతో గణేష్ తన భార్యను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టసాగాడు.

తన భార్యముందే ఆ 17 ఏళ్ల యువతితో సన్నిహితంగా మెలిగేవాడు. రోజు రోజుకు అతడి అరాచకాలు ఎక్కువవ్వసాగాయి. తన స్నేహితులను ఇంటికి తీసుకు వచ్ఛే వాడు. ఈ క్రమంలో ఒక రోజు గణేష్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించబోయారు. ఇంతలో ఆమె గట్టిగా అరుస్తూ ఏడవడంతో వారు భయపడి అక్కడినుంచి పారిపోయారు. అదే సమయంలో ఆమె కూడా అక్కడినుంచి బయటపడింది.  జరిగిన విషయాన్ని ఇంటి యజమానికి వివరించింది. అతడి సహకారంతో తన పుట్టింటికి చేరింది.

కన్నవారికి జరిగినదంతా చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో గణేష్ షాకింగ్ విషయాలు చెప్పాడు. ఇప్పటిదాకా ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం 11 మందిని పెళ్లి చేసుకున్నానని, వారందరితో సన్నిహితంగా ఉంటానని చెప్పాడు. ఇప్పుడు చేసుకున్న ఈమెకు కూడా తనకు వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలుసు అని చెప్పుకొచ్చాడు గణేష్. నిందితుడిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకువచ్చి ఫిర్యాదు చేయాలని, వారికి పోలీసు రక్షణ కల్పిస్తామని చెప్పారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

MPDO Suicide Attempt: జక్రాన్‌పల్లి ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu