AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Chief: భారత్‌లో చొరబడేందుకు 400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు: ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌

Indian Army Chief: భారత్‌లో చొరబడేందుకు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె అన్నారు. దేశలో నియంత్రణ రేఖ వెంబడి..

Indian Army Chief: భారత్‌లో చొరబడేందుకు 400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు: ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌
Subhash Goud
|

Updated on: Jan 15, 2021 | 8:04 PM

Share

Indian Army Chief: భారత్‌లో చొరబడేందుకు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె అన్నారు. దేశలో నియంత్రణ రేఖ వెంబడి 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిపై భారత భద్రతా బలగాలు నిఘా వేసి ఉంచాయని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఆర్మీ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఎల్‌వోసీ వద్ద పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు 44 శాతం పెరిగిందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద గత సంవత్సరం 28 నాటికి పాకిస్థాన్‌ 4,700 ఉల్లంఘనకు పాల్పడిందని, గత 17 ఏళ్లలో ఇదే అత్యధికమని వెల్లడించారు. 2019లో 3,168 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని, వీటిలో 1,551 సార్లు ఒక్క ఆగస్టులోనే జరిగినట్లు పేర్కొన్నారు. జమ్మూలో ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది అదే నెలలో అని తెలిపారు. 2018లో 1,629 సార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు చెప్పారు.

పేలుడు పదార్థాలు తరలించేందుకు సొరంగాలు

కాగా, దేశంలో పేలుడు పదార్థాలు, డ్రోన్లను తరలించేందుకు పాకిస్థాన్‌ సొరంగాలను ఏర్పాటు చేస్తోందని ఆర్మీ చీఫ్‌ చెప్పారు. పాక్‌ చర్యలను భారత సైన్యం డేగ కళ్లతో గమనిస్తోందన్నారు. అయితే కౌంటర్‌ టెర్రరిజం ఆపరేషన్‌లో గత సంవత్సరం దాదాపు 200 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు.

గత ఏడాది 600 మంది ఉగ్రవాదులు లొంగుబాటు

గత ఏడాది 600 మంది ఉగ్రవాదులు లొంగిపోయినట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ తెలిపారు. అలాగే పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Also Read:

Cobra Commando: మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలపై ఆపరేషన్‌.. తుపాకీతో కాల్చుకుని కోబ్రా కమాండో ఆత్మహత్య..!

Strain Virus: కలవరపెడుతున్న స్ట్రెయిన్‌ వైరస్‌.. భారత్‌లో ఇప్పటి వరకు ఎన్ని పాజిటివ్‌ కేసులంటే..