Warplanes Rajnath Singh: యుద్ధ విమానాల కొనుగోలుతో 50 వేల ఉద్యోగాలు: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Warplanes Rajnath Singh: భారత్ 83 ఎల్‌సీవో తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప విషయమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి...
Warplanes Rajnath Singh: భారత్ 83 ఎల్‌సీవో తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప విషయమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఈ యుద్ధ విమానాల కొనుగోలుతో 50 వేల ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రూ.48వేల కోట్లతో 83 తేజస్ యుద్ధ విమానాలు కొనుగోలు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. అలాగే 500 ఎంఎస్‌ఎంఈలు, టాటా, ఎల్‌అండ్‌టీ, వెమ్-టెక్ వంటి ప్రైవేటు కంపెనీలు భాగస్వాములు కావడం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారానికి నిదర్శనమన్నారు.
భారత్ ఎప్పుడు యుద్ధం కోరుకోదని, అయితే భారత సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని ప్రయత్నిస్తే సైన్యం తగిన విధంగా గుణపాఠం చెబుతుందని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. భారత ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని చూస్తే అందుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారని పరోక్షంగా చైనాను ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. చుట్టుపక్కల దేశాలతో భారత్ ఎప్పుడు శాంతియుత సంబంధాలే కోరుకుంటుందని, పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకోవడంలో భారత్ ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. లడఖ్‌లో సైనికులు చూపిన తెగువను రాజ్‌నాథ్ కొనియాడారు. దేశ ప్రజలంతా గర్వించేలా ధైర్యసాహసాలు ప్రదర్శించారని అన్నారు. చైనాతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:
Indian Army Chief: భారత్‌లో చొరబడేందుకు 400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు: ఇండియన్ ఆర్మీ చీఫ్