TRP Scam: టీఆర్‌పీ కుంభకోణం కేసులో ఊహించని మలుపు.. అర్నాబ్‌ గోస్వామి వాట్సాప్‌ సందేశాలు లీక్‌..!

TRP Scam: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌...

  • Subhash Goud
  • Publish Date - 9:01 pm, Fri, 15 January 21
TRP Scam: టీఆర్‌పీ కుంభకోణం కేసులో ఊహించని మలుపు.. అర్నాబ్‌ గోస్వామి వాట్సాప్‌ సందేశాలు లీక్‌..!

TRP Scam: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి, బార్క్‌ మాజీ సీఈవో పార్థోదాస్‌ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన సంభాషణలు బయటకు లీకయ్యాయి. దాదాపు 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్‌ మెసేజ్‌లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఇవి తిరుగులేని ఆధారాలు అంటూ పలువురు స్పందిస్తున్నారు. అయితే కొన్ని చాట్‌లలో టీఆర్పీకి సంబంధించి అవసరమైతే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సాయం చేస్తానంటూ అర్నాబ్‌ గోస్వామి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరో చాట్‌లో మంత్రులంతా మనతోనే ఉన్నారు.. అని చెబుతున్నట్లు ఉంది. కండీవలి పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదైనట్లు కనిపిస్తున్న ఈపీడీఎఫ్‌ పేజీల్లో ప్రతి పేజీకి పలువురి సంతకాలు ఉండటం గమనార్హం.

 

కాగా, 2019 జూలైలో ప్రారంభమైన అదే ఏడాది అక్టోబర్‌ వరకు ఈ సంభాషణలు ఉన్నాయి. ఇది ఒకటే చాట్‌ కాదు ఓ వాల్యూమ్‌ పేజీల్లో హెడ్డింగ్‌లు పెట్టి అర్నాబ్‌ గోస్వామి, వికాస్‌ ఐడెమ్‌, ఆర్‌ఆర్‌పీ గ్రూప్‌, రోమిల్‌ రంగారియా తదితరుల మధ్య సంభాషణలు జరిగినట్లు కూడా ఉన్నాయి. అలాగే మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాల గురించి , మిగతా చానెళ్ల కంటే రిపబ్లిక్‌ చానెల్‌ ముందుండేందుకు ఏ విధంగా ఆయా అంశాలను ప్రసారం చేసిందనే దాని వరకు ఈ సభాషణలున్నాయి.