సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని.. యువతి రహస్య వీడియోలను రికార్డ్ చేసి.. ఆపై
సోషల్ మీడియా వేదికగా పరిచయమయ్యాడు. ఇన్ స్టాగ్రామ్(Instagram) లో పరిచయం పెంచుకున్నాడు. యువతితో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. సాన్నిహిత్యం పెరిగాక వీడియోకాల్స్ చేయడం...
సోషల్ మీడియా వేదికగా పరిచయమయ్యాడు. ఇన్ స్టాగ్రామ్(Instagram) లో పరిచయం పెంచుకున్నాడు. యువతితో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. సాన్నిహిత్యం పెరిగాక వీడియోకాల్స్ చేయడం మొదలెట్టాడు. ఇలా వీరిద్దరి మధ్య చాటింగ్, వీడియో కాల్స్ నిత్యకృత్యమయ్యాయి. ఈ సమయంలో యువతికి తెలియకుండా ఆమె ప్రైవేటు వీడియోలను రికార్డు చేశాడు. తర్వాత వీడియోలను అడ్డు పెట్టుకుని బెదిరింపులకు(Harassment) పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జరిగింది. పంజాబ్ లోని హోషియార్‌పుర్‌కు చెందిన జస్మీత్ సింగ్.. ఇన్స్టాగ్రామ్ లో ఓ యువతితో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెతో చాట్ చేస్తూ దగ్గరయ్యాడు. వీటి ద్వారా వీరిద్దరి మధ్య చనువు ఏర్పడింది.
ఆ సాన్నిహత్యాన్ని అడ్డుపెట్టుకుని జస్మీత్ సింగ్ యువతితో వీడియో కాల్స్ చేయడం ప్రారంభించాడు. ఇలా ఆమెకు తెలియకుండానే చాట్, వీడియో కాల్ లను రహస్యంగా రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వాటిని చూపిస్తూ వేధించడం మొదలు పెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు తెరలేపాడు. దీంతో హతాశురాలైన యువతి.. ఏం చేయాలో తెలియక కుమిలిపోయింది. ఎవరికైనా చెబితే పరువు పోతుందని భావించింది. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువవడంతో చేసేదీమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జస్మీత్ సింగ్ ను అరెస్టు చేసి, మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Also Read
Ajay Devgn : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా బాలీవుడ్ స్టార్ హీరో.. నార్త్‌తో పాటు సోత్‌లో కూడా..
Horoscope Today: వీరికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.. నేడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..