Rahul Gandhi: భారత్ జోడో యాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది.. కష్టపడితే అధికారం మనదేనన్న రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్ర సాగిన 145 రోజులు దేశప్రజలే తనకు ఇల్లుగా భావించానని.. ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూశానని అన్నారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నానన్నారు.

తనలో భారత్ జోడో యాత్ర చాలా మార్పులు తెచ్చిందన్నారు. 84వ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ చివరి రోజు (ఫిబ్రవరి 26) రాహుల్ గాంధీ పార్టీ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలకు మరింత దగ్గరయ్యానని అన్నారు. ఛత్తీస్ గఢ్ రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. భారత్ జోడో యాత్ర సాగిన 145 రోజులు దేశప్రజలే తనకు ఇల్లుగా భావించానని.. ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూశానని అన్నారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నానన్నారు. ప్రజల నుంచి భారత్ జోడో యాత్రకు మద్దతు లభించిందన్నారు. తన యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్‌కు పూర్వవైభవం రానుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.
అదొక విచిత్రమైన సంబంధం. నేను నివసించే ప్రదేశం నాకు ఇల్లు కాదు, కాబట్టి నేను కన్యాకుమారి నుంచి బయలుదేరినప్పుడు.. నా బాధ్యత ఏంటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను భారతదేశాన్ని అర్థం చేసుకున్నాను. వేల, మిలియన్లు ప్రజలు నడుస్తున్నారు నా బాధ్యత ఏంటి..? అని ప్రశ్నించుకున్నారు.
1977 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన సమయంలో తాము ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితుల గురించి రాహుల్ గాంధీ గుర్తు చేశారు. దేశంలోని మోదీ ప్రభుత్వ తీరును ఆయన విమర్శలు చేశారు. విద్వేషపూరిత ప్రచారంతో దేశాన్ని వినాశనం వైపునకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. జమ్ముకశ్మీర్ లో కూడా యువత తనకు అపూర్వరీతిలో స్వాగతం పలికిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
కశ్మీర్ యువత హృదయాల్లో ఈ అనుభూతిని మేం మేల్కొల్పాం. మీరు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని, త్రివర్ణ పతాకంతో నడవాలని మేము వారికి చెప్పలేదు. వారు తమంతట తాముగా వచ్చారు, వేల, లక్షల మంది వచ్చి త్రివర్ణ పతాకాన్ని తమ చేతుల్లోకి తీసుకెళ్లారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం




