Airport: ఎయిర్ పోర్ట్‌లో దిగిన ప్రయాణికుడి తేడా యవ్వారం.. తనిఖీలు చేపట్టిన అధికారులకు దిమ్మతిరిగే షాక్.
అధికారులు, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, పటిష్ట తనిఖీలు చేపట్టిన బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. రకరాల మార్గాల ద్వారా బంగారాన్ని అక్రమంగా దేశంలోకి కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతీ రోజూ దేశంలో ఏదో ఒక విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న...

అధికారులు, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, పటిష్ట తనిఖీలు చేపట్టిన బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. రకరాల మార్గాల ద్వారా బంగారాన్ని అక్రమంగా దేశంలోకి కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతీ రోజూ దేశంలో ఏదో ఒక విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కేరళలో ఇలాంటి ఓ సంఘటనే వెలుగులోకి వచ్చింది. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు సదరు వ్యక్తి ఎంచుకున్న మార్గం అధికారులను సైతం షాకింగ్‌కు గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ శనివారం అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్న రూ.53 లక్షల విలువైన 1259 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసింది. దుబాయ్ నుంచి కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి వాలకం తేడాగా అనిపించడంతో అధికారులు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. దీంతో ఆ ప్రయాణికుడి దగ్గర ఏకంగా రూ. 53 లక్షల బంగారన్ని గుర్తించారు.




Kerala | Air Intelligence Unit (AIU) of Customs department seized 1,259 grams of gold worth Rs 53 lakhs from a passenger coming from Dubai at Kochi airport. 4 capsules of gold concealed inside the passenger’s body were recovered and seized. Passenger has been arrested: Customs pic.twitter.com/ADtX8rWb0G
— ANI (@ANI) February 26, 2023
బంగారంతో నింపిన క్యాప్సుల్స్‌ను మింగాడు. కడుపులో గోల్డ్‌తో నింపిన క్యాప్సుల్స్‌ను దాచుకొని భారత్‌కు వచ్చిన వ్యక్తిని అదికారులు అరెస్ట్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత నిఘా పెంచామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




