YCP MP Complaint: తెలంగాణ సర్కార్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోంది.. చర్యలు తీసుకోండి.. కేంద్రానికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

తెలంగాణ ప్రాజెక్ట్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖల మీద లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉంది. లేఖలు రాయడమే కాకుండా నేరుగా వెళ్లి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తోంది.

YCP MP Complaint: తెలంగాణ సర్కార్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోంది.. చర్యలు తీసుకోండి.. కేంద్రానికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు
Ycp Mp Vijaysaireddy Meets Union Jal Shakti Minister Gajendra Singh Shakawat
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 09, 2021 | 11:26 AM

YCP MP Team Complaint to Union Govt. against Telangana Projects: తెలంగాణ ప్రాజెక్ట్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖల మీద లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉంది. లేఖలు రాయడమే కాకుండా నేరుగా వెళ్లి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తోంది ఏపీకి చెందిన ప్రతినిధుల బృందం. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిశారు. తెలంగాణ చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని తక్షణం ఆపించాలని విజ్ఞప్తి చేశారు.

కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని, ప్రాజెక్ట్‌ల దగ్గర సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్‌లపై అభ్యంతరం చెబుతూ లేఖను కూడా అందించారు విజయసాయిరెడ్డి. 8 ప్రాజెక్ట్‌ల ద్వారా 183 TMCలను తరలించేలా పనులు చేపడుతోందని, మరో 10 ప్రాజెక్ట్‌లను విభజన చట్టానికి విరుద్ధంగా కడుతోందని అభ్యంతరం చెబుతోంది ఏపీ సర్కార్. పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల, మిషన్‌ భగీరథ, కల్వకుర్తి, నెట్టెంపాడు, SLBC విస్తరణ ద్వారా 183 టీఎంసీలను తరలిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

ఇవి కాక మరో ఆరు ప్రాజెక్ట్‌లపై సర్వేకు అనుమతులు ఇచ్చారని కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేస్తోంది. శ్రీశైలం పైభాగాన తుంగభద్ర, కృష్ణ కలిసే చోట 40 టీఎంసీలను వినియోగించుకునేలా జోగులాబం బ్యారేజ్‌ నిర్మించాలని ప్లాన్‌ చేస్తోందని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకువచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. రోజూ ఒక టీఎంసీని తరలించేలా బీమా కెనాల్‌ను విస్తరించాలని చూస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వెంటనే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని విజయసాయిరెడ్డి కోరారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కోరారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకం గా వ్యవహరిస్తోందని, ఒప్పందం మేరకు కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి అన్నారు. అలాగే, విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం ఏలేశ్వరం ప్రాజెక్టును ఖర్చులో సగభాగం జలజీవన్ పథకం కింద భరించాలని కోరారు.

Read Also… Visakha Steel Plant Privatization: ఆ శక్తి ఒక్క వెంకయ్య నాయుడికే ఉంది.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..