AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. అదే ఆలోచిస్తున్నామన్న మంత్రి‌ అనురాగ్‌ఠాకూర్

Mithun Reddy Will Raise: చమురు ధరల పెరుగుదలపై లోక్‌సభలో లేవనెత్తారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారాయన.

ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. అదే ఆలోచిస్తున్నామన్న మంత్రి‌ అనురాగ్‌ఠాకూర్
Ycp Mp Mithun Reddy
Sanjay Kasula
|

Updated on: Mar 15, 2021 | 2:35 PM

Share

చమురు ధరల పెరుగుదలపై లోక్‌సభలో లేవనెత్తారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారాయన. క్రూడాయిల్‌ ధర తగ్గినా పెట్రోల్‌ ధర తగ్గడం లేదన్నారు. సామాన్యుడిపై భారం తగ్గించేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటో చెప్పాల్సిన అవసరముందన్నారు మిథున్‌రెడ్డి.

మిథున్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ఠాకూర్‌. జీఎస్టీ కౌన్సిల్‌లో రాష్ట్రాలు కూడా భాగస్వాములేనని.. పెట్రోల్‌ ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకువచ్చే అంశంపై చర్చించవచ్చన్నారు. రాష్ట్రాలు పన్ను భారాన్ని కొంతమేర తగ్గించాల్సిన అవసరముందన్న కేంద్ర మంత్రి.. కేంద్రం కూడా ఈ విషయమై ఆలోచిస్తుందన్నారు.

పెరగడమే కాని తగ్గని..

కొన్నిరోజులుగా పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లుగా దూసుకుపోతున్న ఇంధన ధరలకు గడిచిన కొన్ని రోజులుగా బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. అయితే భారీగా ధరలు తగ్గకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం చెక్‌ పడింది. సోమవారం కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఆదివారంతో పోల్చితే స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు పెట్రోల్ ధర…

మరి ఈ రోజు ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..ఢిల్లీలో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా ( ఆదివారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (ఆదివారం  రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (ఆదివారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (ఆదివారం రూ.88.60 )గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (ఆదివారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (ఆదివారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం కరీంనగర్‌లో మాత్రం ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.91 (ఆదివారం రూ. 94.67 ), డీజిల్‌ రూ. 88.96 (ఆదివారం రూ. 88.73 )గా నమోదైంది.

ఇవి కూడా చదవండి..

ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మీరు వడ్డీ లేకుండా రూ.10వేల వరకు తీసుకోవచ్చు…

Masiero Naked Protests: అవార్డుల పండగ వేడుకలో నిరసన గళం.. బట్టలు విప్పేసిన ఉత్తమ నటి..