AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Day: జీవితంలో ఎన్నో కష్టాలు చూశా.. పుట్టగొడుగుల ఉత్పత్తితో అభివృద్ధి వైపు.. ఉమెన్స్‌ డే సందర్భంగా..

Women's Day: మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్‌ ఖాతాలో పలువురు మహిళల ప్రయాణాన్ని వారు సాధించిన ఘనతను తెలియజేస్తూ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పంచుకున్నారు. అనితా దేవి 2016లో మాధోపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇప్పుడు వందలాది మంది మహిళలు ఆ కంపెనీలో పనిచేస్తున్నారు..

Women's Day: జీవితంలో ఎన్నో కష్టాలు చూశా.. పుట్టగొడుగుల ఉత్పత్తితో అభివృద్ధి వైపు.. ఉమెన్స్‌ డే సందర్భంగా..
Subhash Goud
|

Updated on: Mar 08, 2025 | 11:07 AM

Share

బీహార్‌లోని నలంద జిల్లాలోని అనంతపురం గ్రామానికి చెందిన అనితా దేవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన స్టార్టప్ ప్రయాణం గురించి ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పంచుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్‌ ఖాతాలో పలువురు మహిళల ప్రయాణాన్ని వారు సాధించిన ఘనతను తెలియజేస్తూ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పంచుకున్నారు. అనితా దేవి 2016లో మాధోపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇప్పుడు వందలాది మంది మహిళలు ఆ కంపెనీలో పనిచేస్తున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన అనితాదేవి తన మహిళా దినోత్సవం సందర్భంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశానని, కానీ తాను ఎప్పుడు కూడా స్వయంగా ఏదైనా చేయాలనే భావించానని, ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలనని చెప్పారు. 2016లో తాను స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఆ కాలంలో స్టార్టప్‌ల పట్ల క్రేజ్ బాగా పెరిగింది. అందువల్ల 9 సంవత్సరాల క్రితం తాను మాధోపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ని కూడా స్థాపించానని చెప్పుకొచ్చారు.

పుట్టగొడుగుల ఉత్పత్తితో స్వావలంబన దిశగా..

ఈ రోజు నేను పుట్టగొడుగుల ఉత్పత్తి ద్వారా నా కుటుంబాన్ని పోషించడానికి పని చేస్తున్నానని అన్నారు. తన మార్గాన్ని సులభతరం చేయడమే కాకుండా, వందలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా స్వావలంబన సాధించానని అన్నారు. ఇప్పుడు నా కంపెనీ కూడా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు వంటి వాటిని సరసమైన ధరలకు అందిస్తుంది. నేడు ఈ సంస్థలో పనిచేస్తున్న వందలాది మంది మహిళలు జీవనోపాధితో పాటు ఆత్మగౌరవ జీవితాన్ని పొందుతున్నారని అన్నారు.

నా స్ఫూర్తి – మహిళలను స్వావలంబనగా మార్చడానికి!

బీహార్ ప్రభుత్వం ప్రాజెక్ట్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (NRLM) సహాయంతో నేను పుట్టగొడుగుల ఉత్పత్తిలో శిక్షణ తీసుకుకున్నానని అన్నారు. దీని తరువాత నేను పుట్టగొడుగుల పెంపకంతో వందలాది మంది మహిళలను కూడా అనుబంధించాను. ఇప్పుడు గ్రామంలోని ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడాలనేది నా కల. మఖానా బోర్డు ఏర్పాటు ప్రకటన తర్వాత మఖానాకు సంబంధించిన పనుల గురించి కూడా ఆలోచిస్తున్నానని అన్నారు.

స్వావలంబన సమాజం!

నాతో పనిచేసే మహిళలు స్వావలంబనగా మారడం నా గొప్ప ఆనందం. ఆర్థిక స్వాతంత్ర్యం మహిళల గౌరవం, సామాజిక స్థితిని మాత్రమే బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నాను అని అన్నారు. ఈ రోజు నాతో ఉన్న స్త్రీలు తమ కుటుంబాలకు ఏదైనా మంచి చేస్తే, నేను దానితో చాలా సంతృప్తి చెందానని అన్నారు.

మీరు కూడా చేయవచ్చు!

ఈ పని నేను చేయగలిగితే ఎవరైనా చేయగలరని నా నమ్మకం ఉందన్నారు. దేశంలోని సోదరీమణులందరికీ నా సందేశం ఏమిటంటే వారు స్వయం సమృద్ధిగా మారాలి. అలాగే వారి కుటుంబాల జీవితాలను కూడా మార్చడానికి కృషి చేయాలి. మీరు మీ అంకితభావం, కృషితో ముందుకు సాగాలని సంకల్పించినట్లయితే, ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని ఆపదని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..