ఆ రూట్‌లో షిరిడి వెళుతున్నారా..? అయితే, ఈ అమ్మాయిలతో జాగ్రత్త..!

కొన్ని బ్యాగు లను కిలేడీస్ బాత్రూమ్‌ల్లో పెట్టినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది యువతులను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. వీరంతా నాందేడ్‌లోని గురుద్వార్‌కు వెళ్లి అక్కడ నుంచి నిజామాబాద్ నగరానికి వచ్చినట్లు తెలిసింది.

ఆ రూట్‌లో షిరిడి వెళుతున్నారా..? అయితే, ఈ అమ్మాయిలతో జాగ్రత్త..!
Train
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 13, 2023 | 11:33 AM

మీరు నిజామాబాద్ మీదుగా షిర్డీ వెళ్తున్నారా..? అయితే ప్ర‌యాణ స‌మ‌యంలో జాగారం ఉండాల్సిందే..! లేక‌పోతే మీ జేబులు, బ్యాగులు, ఒంటిపై విలువైన వస్తువులకు గ్యారెంటీ లేదు. మీ తోటి ప్రయాణికులే మిమ్మల్నీ నిలువునా లూటీ చేసేస్తారు. అవును..! ప్రయాణికుల్లా రైలు ఎక్కుతారు. ఆ తర్వాత అదును చూసుకుని మీ దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తారు ఆ కీలాడి లేడిలు..చూడ‌టానానికి మోడ్ర‌న్ గా ఉన్నారు అని లైట్ తీసుకుంటే ఉన్నదంత దోచుకుని నిలువు నామం పెట్టి చల్లగా జారుకుంటారు. అలాంటి ఓ గ్యాంగ్ ను అరెస్ట్ చేసారు నిజామాబాద్ రైల్వే పోలిసులు. నిజామాబాద్ మీదుగా తిరుపతి నుంచి షిర్డీ వెళ్తున్న సాయినగర్ షిర్డీ రైలులో దొంగతనానికి పాల్పడిన తొమ్మిది మంది యువతులను ప్రయాణికులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జులై 11 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 2- 3 గంటల మధ్యలో రైలు నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరింది. ఆ తర్వాత నవీపేట్ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఉండటంతో అక్కడ అగిపోయింది. దీంతో మహారా ష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు రైలులో ఎక్కారు. యువతులు ఎస్1 నుంచి ఎస్ 10 బోగీలలో అటు ఇటూ తిరిగారు. ఈ క్రమంలోనే మొదట ఓ బోగీలో ప్రయాణికుడి బ్యాగ్ మిస్స్‌ అయ్యింది. బ్యాగ్‌ కనబడకపోవడంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే కోచ్‌లోని ప్రయాణికులంతా అప్రమత్తమయ్యారు. ప్రయాణికులంతా.. తమ బ్యాగ్‌లను చెక్ చేసుకోగా మరో ఆరుగురికి చెందిన బ్యాగులు కూడా కనిపించలేదు. దీంతో బోగీలో ఒక్కసారి కలకలం రేగింది. కొందరు ప్రయాణికులు బాసర వద్ద ట్రైన్ చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. అంతలోనే కొందరు యువతులు బ్యాగులతో పరుగెత్తడంతో ప్రయాణికులు పట్టుకున్నారు. బాసర పోలీసులకు సమాచారం అందించి, మొత్తం తొమ్మిది మందిని అప్పగించారు. ఆర్పీఎఫ్‌, బాసర పోలీసులు అక్కడి నుంచి యువతులను నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

రంగస్వామి అనే ప్రయాణికుడికి చెందిన బ్యాగ్ తో పాటు ల్యాప్‌ట్యాప్‌, కొంత నగదు, ఓ మహిళ మెడలోని బంగారు చైన్ పోయినట్లు తెలిసింది. పావని, ధనుంజయ్, షేక్ నజీర్ బాషా, లీలావతి, సుబ్బారాయుడు, శ్రీనివాస్ అనే ప్రయాణికుల బ్యాగ్‌లు పోయాయి. మూడు బ్యాగ్‌లను పోలీసులు రైల్వే పట్టాల పక్కన గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బ్యాగు లను కిలేడీస్ బాత్రూమ్‌ల్లో పెట్టినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది యువతులను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. వీరంతా నాందేడ్‌లోని గురుద్వార్‌కు వెళ్లి అక్కడ నుంచి నిజామాబాద్ నగరానికి వచ్చినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..