Watch: స్కూటీపై వెళ్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు..ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే..

కారు ఢీకొట్టిన వేగానికి ఆమె దాదాపు 30 అడుగుల దూరంలో పడిపోయింది. ఆమె స్కూటర్‌ వెనుక వస్తున్న కారుతోపాటు గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఉన్న టెంపోను కూడా ఆ కారు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు గ్యాస్‌ సిలిండర్లు పేలలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ పవిత్రను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి

Watch: స్కూటీపై వెళ్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు..ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే..
Woman Cop Sent Flying Into Air
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 18, 2024 | 8:03 PM

మహిళా కానిస్టేబుల్‌ ప్రయాణిస్తున్న స్కూటీని ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె అమాంతంగా గాల్లోకి ఎగిరిపడింది. వేగంగా వెళ్తున్న కారు అంతటితో ఆగలేదు.. స్కూటీ వెనుక ఉన్న మరో కారు, గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఉన్న టెంపోను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల పవిత్ర, పోరూర్ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం డ్యూటీ ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

పవిత్ర డ్రైవ్‌ చేస్తున్న స్కూటీని ఎదురు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ పవిత్ర గాల్లోకి ఎగిరి దూరంగా పడింది. ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకెళ్లటంతో పవిత్ర గాలిలోకి ఎగిరిపడింది. కారు ఢీకొట్టిన వేగానికి ఆమె దాదాపు 30 అడుగుల దూరంలో పడిపోయింది. ఆమె స్కూటర్‌ వెనుక వస్తున్న కారుతోపాటు గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఉన్న టెంపోను కూడా ఆ కారు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు గ్యాస్‌ సిలిండర్లు పేలలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ పవిత్రను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. కాగా, సమీపంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..