Sharad Pawar: ఫలితాల గురించి అంతా తెలుసు.. రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం అబద్ధం: శరద్‌ పవార్‌

Sharad Pawar - Presidential Election: అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు గత కొన్ని రోజులుగా పలు పార్టీలు సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ

Sharad Pawar: ఫలితాల గురించి అంతా తెలుసు.. రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం అబద్ధం: శరద్‌ పవార్‌
Sharad Pawar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 15, 2021 | 7:57 AM

Sharad Pawar – Presidential Election: అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు గత కొన్ని రోజులుగా పలు పార్టీలు సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ ఎదుర్కొవడం అసాధ్యమంటూ ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో రెండు సార్లు భేటీ కావడం అనంతరం.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. బీజేపీ వ్యతిరేకంగా ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను పోటీలో దింపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమంటూ ఆయన వ్యాఖ్యానించారు.

300 మందికి పైగా ఎంపీలు ఉన్న బీజేపీని చూస్తే ఫలితం ఎలా ఉంటుందో తనకు తెలుసని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని పవార్ స్పష్టంచేశారు. అయితే.. ప్రశాంత్ కిషోర్ తనను రెండుసార్లు కలిసినట్లు శరద్‌ పవార్‌ వెల్లడించార. అయితే పీకే తాను.. తన సంస్థ గురించి మాత్రమే మాట్లాడుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహాలను రూపొందించే రంగాన్ని విడిచిపెట్టినట్లు ప్రశాంత్ కిషోర్ తనతో చెప్పారని తెలిపారు.

కాగా.. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు.. వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు నాయకత్వం గురించి ప్రశాంత్‌ కిషోర్‌తో ఎలాంటి చర్చలు జరుగలేదని శరద్‌ పవార్‌ వెల్లడించారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలకు ఎలాంటి నాయకత్వం వహించబోనని పేర్కొన్నారు. అయితే.. అప్పటి పరిస్థితుల మేరకు రాజకీయాల్లో మార్పురావొచ్చంటూ శరద్ పవార్ పేర్కొన్నారు.

Also Read:

బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి ఇంటివద్ద సీఐడీ బృందం.. పర్సనల్ గార్డ్ సూసైడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

Gold and Silver Price : పరుగులు పెడుతున్న పసిడి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..